హయర్‌ నుంచి కినౌచి డార్క్‌ ఎడిషన్‌ ఎసిలు

Jun 26,2024 21:25 #Business

న్యూ ఢిల్లీ : హయర్‌ ఇండియా కొత్తగా కినౌచి డార్క్‌ ఎడిషన్‌ ఎయిర్‌ కండీషన్‌ సీరిస్‌ను ప్రారంభించినట్లు తెలిపింది. భారతీయ గృహాలకు అద్బుతమైన సౌకర్యాలను అందించాలనే తమ బ్రాండ్‌ నిబద్ధతకు ఇది నిదర్శమని హయర్‌ అప్లయన్సెస్‌ ఇండియా ప్రెసిడెంట్‌ ఎన్‌ఎస్‌ సతీష్‌ పేర్కొన్నారు. ఇవి రూ.46,990 ప్రారంభ ధరతో లభిస్తాయన్నారు. లాంచ్‌ ఆఫర్‌లో భాగంగా, 10 శాతం వరకు క్యాష్‌బ్యాక్‌ ఆఫర్‌లతో పాటు రూ.15,990 విలువైన ఐదు సంవత్సరాల సమగ్ర వారంటీని అందిస్తోందన్నారు. ఉచిత ఇన్‌స్టాలేషన్‌, జీవితకాల కంప్రెసర్‌ వారంటీ కూడా ఉన్నాయన్నారు.

➡️