బిఎస్‌ఎన్‌ఎల్‌ డేటా లీక్‌

Jun 26,2024 21:32 #Business

నూఢిల్లీ : టెలికం సంస్థ బిఎస్‌ఎన్‌ఎల్‌ వినియోగదారుల సమాచారం హ్యాకర్లు అమ్మకానికి పెట్టారని అథెంటియన్‌ టెక్నాలజీస్‌ తన నివేదికలో తెలిపింది. బిఎస్‌ఎన్‌ఎల్‌కు చెందిన 278 జిబి డేటా ఉందంటూ కిబర్‌ ఫాంటోమ్‌ అనే వ్యక్తి 5000 డాలర్లకు అమ్మకానికి పెట్టారని పేర్కొంది. గత ఆరు నెలల్లో బిఎస్‌ఎన్‌ఎల్‌ డేటా హ్యాక్‌ అవ్వడం ఇది రెండోసారి. ఈ డేటాలో సిమ్‌ కార్డ్‌ వివరాలు, అంతర్జాతీయ మొబైల్‌ చందాదారుల గుర్తింపు హోమ్‌ లకేషన్‌ తదితర సమాచారం ఉందని అథెంటియన్‌ టెక్నాలజీస్‌ పేర్కొంది. ఈ డేటాతో మోసగాళ్లు సైబర్‌ దాడులకు పాల్పడే అవకాశం ఉందని హెచ్చరించింది.

➡️