ఎఐ టూల్స్‌తో సామ్‌సంగ్‌ ఉత్పత్తులు

Mar 23,2024 21:18 #Business

న్యూఢిల్లీ: ప్రముఖ ఎలక్ట్రానిక్స్‌ ఉత్పత్తుల కంపెనీ సామ్‌సంగ్‌ కొత్తగా ఎఐ టూల్స్‌తో టివి, స్మార్ట్‌ఫోన్‌, ల్యాప్‌టాలను ఆవిష్కరించింది. ముంబయిలోని జియో వాల్డ్‌ ప్లాజాలో వీటిని ఆ కంపెనీ సామ్‌సంగ్‌ ఎలక్ట్రానిక్స్‌ డిఎక్స్‌ డివిజన్‌ సిఇఒ జాంగ్‌ హీ హన్‌ విడుదల చేశారు. అదే విధంగా ల్యాప్‌టాప్‌ సీరిస్‌లో గెలాక్సీ బుక్‌ 4ను అందుబాటులోకి తెచ్చింది. ఇంటెల్‌ కోర్‌ 5 ప్రాసెసర్‌, 8జిబి ర్యామ్‌ వేరియంట్‌ ధర రూ.70,990గా కంపెనీ పేర్కొంది.

➡️