ఐటెల్‌ నుంచి ఎ70 స్మార్ట్‌ఫోన్‌

Jan 4,2024 22:20 #Business

న్యూఢిల్లీ : ఐటెల్‌ కొత్తగా ఎ70 స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. మెమొరీ ఫ్యూషన్‌ టెక్నాలజీతో దేశీయంగా తొలి 256బిజి స్టోరేజీ, 12 జిబి ర్యామ్‌ ఫోన్‌ను అందుబాటులోకి తెచ్చినట్లు ఆ సంస్థ తెలిపింది. 6.6 అంగుళాల హెచ్‌డి డిస్ప్లే కలిగిన ఈ స్మార్ట్‌ఫోన్‌ ధరను రూ.7,299గా నిర్ణయించింది. 5,000 ఎంఎహెచ్‌ బ్యాటరీ, వెనుకవైపు 13 మెగాపిక్సెల్‌ హెచ్‌డి కెమెరా, సెల్ఫీల కోసం 8 మెగాపిక్సెల్‌ ఎఐ సెల్ఫీ కెమెరాను అమర్చింది.

➡️