ఐఫోన్‌ కేసుల తయారీకి టాటా భారీ నియామకాలు

Nov 28,2023 21:24 #Business

న్యూఢిల్లీ : ఐఫోన్‌ కేసుల తయారీ విస్తరణకు టాటా గ్రూపు వేలాది మంది ఉద్యోగుల నియామకాలకు కసరత్తు చేస్తుందని సమాచారం. హోసూర్‌లో తన ఐఫోన్‌ కేసింగ్‌ తయారీ ప్లాంట్‌ సామర్థ్యాన్ని రెట్టింపు చేసేందుకు కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం 500 ఎకరాల్లో 15,000 మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. ఉద్యోగుల సంఖ్యను 25,000 నుంచి 28,000 వరకూ పెంచడానికి టాటా ఎలక్ట్రానిక్స్‌ మ్యాన్యుఫ్చాక్చరింగ్‌ యోచిస్తోంది. నూతనంగా సమీకరించిన ఐఫోన్‌ అసెంబ్లింగ్‌ ప్లాంట్‌ సామర్ధ్యాన్ని వినియోగించుకుంటూ.. ఈ రంగంలో మరింత రాణించడానికి ప్రణాళికలు రూపొందిస్తుందని రిపోర్టులు వస్తున్నాయి.

➡️