ఎమ్మెల్యే శిరీషాకు అభినందనలు వెల్లువ

Jun 16,2024 16:58 #Alluri District, #MLA, #sanmanam, #TDP

ప్రజాశక్తి-రాజవొమ్మంగి(అల్లూరి జిల్లా) : ఎన్డీఏ కూటమి రంపచోడవరం నియోజకవర్గ టిడిపి ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి సార్వత్రిక ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన నేపథ్యంలో ఆదివారం మండలంలోని ఎమ్మెల్యే నివాస గ్రామంలో ఎమ్మెల్యే శిరీషా దేవి, విజయభాస్కర్ దంపతులను టిడిపి, జనసేన,బిజెపి నాయకులు, కార్యకర్తలు,అభిమానులు కలసి పూలమాలలు వేసి, సాలువాలు కప్పి, పుష్పగుచ్చాలు ఇచ్చి అభినందించారు. ఎమ్మెల్యే నివాసం వద్ద టిడిపి నాయకులు,కార్యకర్తలు, అభిమానులతో కోలాహాలంగా మారింది, పలువురు సచివాలయ, ఇతర ఉద్యోగులు, మహిళలు, గ్రామస్తులు ఎమ్మెల్యే శిరీష దేవిని అభినందనలు తెలుపుతూ సాలువాలు కప్పి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శిరీష దేవి మాట్లాడుతూ.. పార్టీకి నాయకులు,కార్యకర్తలే ఊపిరి అని,తెలుగుదేశం గెలుపుకు వారి చేసిన కృషి మరువలేనిదన్నారు,నన్ను నమ్మి ఓట్లు వేసి గెలిపించిన ప్రజలు రుణపడి ఉంటానని రంపచోడవరం నియోజకవర్గం అభివృద్ధికి మౌలిక వసతులు కల్పనకు నిక్స్పక్షపాతంగా పనిచేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో రంపచోడవరం నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు మఠం విజయభాస్కర్ టిడిపి నాయకులు,తదితరులు పాల్గొన్నారు.

➡️