ఒఎన్‌డిసితో రెడ్‌బస్‌ జట్టు

Feb 10,2024 21:30 #Business

హైదరాబాద్‌ : ప్రముఖ ఆన్‌లైన్‌ బస్‌ టికెటింగ్‌ వేదిక రెడ్‌ బస్‌ తాజాగా ఓపెన్‌ నెట్‌వర్క్‌ ఫర్‌ డిజిటల్‌ కామర్స్‌ (ఒఎన్‌డిసి)తో జట్టు కట్టినట్లు తెలిపింది. దీని ద్వారా హదరాబాద్‌లోని ఆటో రిక్షాలను బుక్‌ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నట్లు పేర్కొంది. నగరంలో ఉండే ప్రయాణికులకు మొదటి, చివరి మైలు వరకు ప్రయాణ కనెక్టివిటీ అందించనున్నట్లు తెలిపింది. ఇకపై రెడ్‌ బస్‌ ఆండ్రాయిడ్‌ యాప్‌ ద్వారా ఆటో రిక్షాలను బుక్‌ చేసుకోవచ్చని పేర్కొంది.

➡️