జమ్ము అండ్‌ కాశ్మీర్‌ బ్యాంక్‌తో ఎంఎస్‌ఐఎల్‌ ఒప్పందం

Jan 30,2024 21:22 #Business

హైదరాబాద్‌ : జమ్ము అండ్‌ కాశ్మీర్‌ బ్యాంక్‌తో మారుతి సుజుకీ ఇండియా లిమిటెడ్‌(ఎంఎస్‌ఐఎల్‌) అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఒప్పందంలో భాగంగా డీలర్లకు ఇన్వెంటరీపై నిధులను అందించనుంది. దేశ వ్యాప్తంగా ఉన్న 4,000 మారుతి సుజుకీ సేల్స్‌ ఔట్‌ లెట్స్‌కు లబ్ది చేకూరనుంది. డీలర్లకు అవసరమైన మూలధన అవసరాల కోసం బ్యాంక్‌ తోడ్పాటు అందించనుంది. ఎంఎస్‌ఐ సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ శశాంక్‌ శ్రీవాత్సవ, సమక్షంలో మారుతి సుజుకీ జనరల్‌ మేనేజర్‌ విశాల్‌ శర్మ, బ్యాంక్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ సుధీర్‌ గుప్తా ఈ ఒప్పందం కుదుర్చుకున్నారు.

➡️