ట్రస్ట్‌ ఫిన్‌టెక్‌ ఐపిఒ ధరల శ్రేణీ నిర్ణయం

Mar 20,2024 21:10 #Business

హైదరాబాద్‌ : ఫిన్‌టెక్‌ సాఫ్ట్‌వేర్‌ సొల్యూషన్స్‌ సంస్థ ట్రస్ట్‌ ఫిన్‌టెక్‌ లిమిటెడ్‌ ఇన్షియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌ (ఐపిఒ) ధరల శ్రేణీని ప్రకటించింది. ఈ సంస్థ ఇష్యూ మార్చి 26న ప్రారంభమై.. 28తో ముగియనుంది. యాంకర్‌ ఇన్వెస్టర్ల కోసం శుక్రవారం ఇష్యూను తెరవనుంది. షేర్ల ధరల శ్రేణీని రూ.95ా101గా నిర్ణయించింది. ఈ ఇష్యూలో రూ.10 ముఖ విలువ కలిగిన 62.82 లక్షల ఈక్విటీ షేర్లను విక్రయించనుంది. దీంతో రూ.63.45 కోట్లు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. కనీసం ఒక్క లాట్‌లో 1200 ఈక్విటీ షేర్లకు బిడ్డింగ్‌ వేయాల్సి ఉంటుంది.

➡️