తదుపరి వృద్థికి ప్రయివేటు పెట్టుబడులే కీలకం-ఆర్‌బిఐ బులిటెన్‌లో వెల్లడి

Feb 20,2024 21:05 #Business

ముంబయి : భారతదేశ తదుపరి వృద్థికి ప్రయివేటు పెట్టుబడులు కీలకంగా మారనున్నాయని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా తన బులిటెన్‌లో పేర్కొంది. 2023-24 ప్రథమార్థంలో అంచనాలకు అనుగుణంగానే ఆర్థిక వ్యవస్థ నమోదయ్యిందని పేర్కొంది. కార్పొరేట్‌ రంగంలోని తాజా పెట్టుబడులు తదుపరి వృద్థికి ప్రధానం కానున్నాయని పేర్కొంది. 2024లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అంచనాల కంటే బలంగానే ఉందని శనివారం విడుదల చేసిన ఆర్‌బిఐ తన బులిటెన్‌లో పేర్కొంది. 2024-25లో భారత వృద్థి రేటు 7 శాతంగా చోటు చేసుకోవచ్చని సెంట్రల్‌ బ్యాంక్‌ అంచనా వేసింది. 2019 అక్టోబర్‌తో పోల్చితే రిటైల్‌ ద్రవ్యోల్బణం 2024 జనవరి, అంతక్రితం డిసెంబర్‌, నవంబర్‌లోనూ తక్కువగానే నమోదయ్యిందని తెలిపింది. వచ్చే 2024-25కు గాను రిటైల్‌ సిపిఐ 4.5 శాతంగా ఉండొచ్చని అంచనా వేసింది.

➡️