నథింగ్‌ ఫోన్‌ 2ఎ విడుదల

Mar 8,2024 21:02 #Business

న్యూఢిల్లీ : భారత మార్కెట్లోకి నథింగ్‌ ఫోన్‌ 2ఎను సిఎంఎఫ్‌ బై నథింగ్‌ విడుదల చేసింది. 8జిబి ర్యామ్‌, 128జిబి స్టోరేజ్‌ వేరియంట్‌ ప్రారంభ ధరను రూ.23,999గా నిర్ణయించింది. నథింగ్‌ నైపుణ్యం, ఇంజనీరింగ్‌, పనతనంతో ప్రధాన వినియోగదారు అవసరాలను మరింత శక్తివంతంగా నెరవేరుస్తుందని ఆ సంస్థ తెలిపింది. శక్తివంతమైన విలక్షణమైన ప్రాసెసర్‌, సాటిలేని 50 ఎంపి డ్యూయల్‌ రియర్‌ కెమేరా, అదనపు ప్రకాశవంతమైన అమోలెడ్‌ డిస్‌ ప్లే దీని ఫీచర్లుగా ఉన్నాయని పేర్కొంది.

➡️