మహిళలకు విద్యుత్‌ వాహనాలు చౌక..!

Jan 4,2024 22:15 #Business

కేంద్రం ప్రత్యేక రాయితీ యోచన

న్యూఢిల్లీ : మహిళల పేరుపై కొనుగోలు చేసే విద్యుత్‌ వాహనాలపై అదనంగా సబ్సీడీ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఫాస్టర్‌ అడాప్షన్‌ అండ్‌ మాన్యుఫ్యాక్షరింగ్‌ ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌ (ఫేమ్‌ 3) స్కీమ్‌ కింద మహిళలలకు 10 శాతం అదనపు రాయితీ ఇవ్వాలని భావిస్తోంది. ఫేమ్‌3లో భాగంగానే ఇవిల సబ్సిడీ కోసం రూ.26,400 కోట్లు కేటాయించాలని భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ యోచిస్తోందని రిపోర్టులు వస్తున్నాయి. ఇందులోని మొత్తాన్ని ద్విచక్ర ఇవిల కోసం రూ.8158 కోట్లు, బస్సులు కోసం రూ. 9,600 కోట్లు, త్రీవీలర్ల కోసం రూ.4,100 కోట్లు కేటాయించనున్నట్లు సమాచారం. కొనుగోళ్లపై అందించే రాయితీ మాత్రమే కాకుండా టెక్నాలజీ డెవలప్‌మెంట్‌, ట్రయల్‌ రన్‌ వర్క్స్‌ కోసం అదనంగా నిధులు ఇవ్వడం ద్వారా మొత్తంగా రూ.33వేల కోట్లను మూడో దశకు కేటాయించే అవకాశం ఉందని సమాచారం.

➡️