రూ.63వేల చేరువలో బంగారం ధర

Nov 28,2023 21:30 #Business

న్యూఢిల్లీ : బంగారం ధర రూ.63వేల చేరువలో ఉంది. మంగళవారం న్యూఢిల్లీ బులియన్‌ మార్కెట్‌లో 24 క్యారెట్ల స్వచ్ఛత కలిగిన 10 గ్రాముల పసిడి ధర రూ.100 పెరిగి రూ.62,750కి చేరిందని హెచ్‌డిఎఫ్‌సి సెక్యూరిటీస్‌ పేర్కొంది. కిలో వెండి ధర మాత్రం యథాతథంగా రూ.78,200గా నమోదయ్యింది. అంతర్జాతీయ మార్కెట్‌లో ఒక్క ఔన్స్‌ పసిడి ధర 4 డాలర్లు పెరిగి 2,014 డాలర్లుగా పలికింది. కాగా.. చెన్నరులో 10 గ్రాముల బంగారం ధర రూ.63,050కి చేరి ఆల్‌టైం రికార్డ్‌ను దాటాయి. అభరణాలకు ఉపయోగించే 22 క్యారట్ల బంగారం ధర రూ.57,800గా నమోదయ్యింది.

➡️