విట్‌-ఎపిలో ‘కంపరేటివ్‌ లా’పై అంతర్జాతీయ సదస్సు

Feb 17,2024 21:23 #Business

విజయవాడ : విట్‌-ఎపి యూనివర్శిటీ స్కూల్‌ ఆఫ్‌ లా (విఎస్‌ఎల్‌), విట్‌ ఎపి యూనివర్శిటీ, బిర్మింఘమ్‌ స్కూల్‌ ఆఫ్‌ లా సంయుక్తంగా ‘కంపరేటివ్‌ లా’పై అంతర్జాతీయ సదస్సును ఏర్పాటు చేశాయి. దీనికి బెంగళూరులోని ఎంఎస్‌ రామయ్య కాలేజీ ఆఫ్‌ లా స్పాన్సర్‌గా వ్యవహారించింది. ‘ఏ స్టోరీ ఆఫ్‌ ఎక్స్‌ప్లోరింగ్‌ కన్వర్జెన్సెస్‌, డైవెర్‌జెస్సెస్‌, లిమినల్‌ స్పేసెస్‌’ టైటిల్‌తో దీన్ని నిర్వహించారు. ఫిబ్రవరి 15న ప్రారంభమైన ఈ సదస్సు.. 17తో ముగిసింది. అంతర్జాతీయ వాణిజ్య వివాదాల్లో అవకాశాలు, సవాళ్ల నేపథ్యంలో టెక్నలాజీ, ఎఐని ఎలా ఉపయోగించుకోవాలనే దానిపై వక్తలు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో విట్‌ా ఎపి యూనివర్శిటీ వైస్‌ ఛాన్స్‌లర్‌ ఎస్‌వి కోటా రెడ్డి, రిజిస్ట్రర్‌ జగదీష్‌ చంద్ర ముడిగంటి, డీన్‌ బెనర్జీ చక్కా, రామయ్య కాలేజీ ఆఫ్‌ లా ప్రిన్సిపల్‌ ఉమా మహేష్‌ సత్యనారాయణ, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి రవీంద్ర భట్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా 120 పరిశోధన పత్రాలను స్వీకరించగా.. 80 పత్రాలను ప్రవేశపెట్టారు.

➡️