హైదరాబాద్‌లో నివాసాలకు డిమాండ్‌ : స్కేర్‌ యార్డ్‌

Jan 13,2024 21:15 #Business

హైదరాబాద్‌ : నగరంలో నివాస విక్రయాలకు డిమాండ్‌ పెరిగిందని స్కేర్‌ యార్డ్‌ తెలిపింది. గతేడాది అక్టోబర్‌ డిసెంబర్‌ త్రైమాసికంలో 16.808 యూనిట్ల గృహాలు విక్రయమయ్యాయని తెలిపింది. వీటి విలువ రూ.9,497 కోట్లుగా ఉందని పేర్కొంది. అపర్ణ కన్‌స్ట్రక్షన్‌, సుమధుర ఇన్‌ఫ్రాకాన్‌ అమ్మకాల్లో ముందున్నాయని వెల్లడించింది. దేశంలోని ఇతర మెట్రో నగరాలతో పోలిస్తే హైదరాబాద్‌ మార్కెట్‌ ఆశాజనకంగా ఉందని స్కేర్‌యార్డ్‌ పార్ట్‌నర్‌ భట్టాచార్య పేర్కొన్నారు.

➡️