gold దిగుమతుల్లో 210% పెరుగుదల

Jun 17,2024 20:45 #Business, #Gold
  • యుఎఇతో ఎఫ్‌టిఎ ఫలితం

న్యూఢిల్లీ : యుఎఇతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టిఎ)తో ఆ దేశం నుంచి భారీగా పసిడి, వెండి దిగుమతులు పెరిగాయి. గడిచిన 2023-24లో బంగారం, వెండి దిగుమతులు 210 శాతం ఎగిసి 3.5 బిలియన్‌ డాలర్ల నుంచి 10.7 బిలియన్‌ డాలర్లకు చేరాయి. దీంతో రాయితీ కస్టమ్స్‌ సుంకం రేట్లను సవరించాల్సిన అవసరం ఉందని గ్లోబల్‌ ట్రేడ్‌ రీసెర్చ్‌ ఇన్సియేటివ్‌ (జిటిఆర్‌ఐ) ఓ రిపోర్ట్‌లో పేర్కొంది. భారత్‌ తన వాణిజ్య విధానాలను సమతుల్యం చేసుకోవడానికి, దేశీయ ఆదాయాన్ని కాపాడుకోవడానికి, విలువైన లోహాలు, ఆభరణాల దిగుమతిలో న్యాయమైన పోటీని నిర్ధారించడానికి ప్రభుత్వం కొన్ని చర్యలను అమలు చేయాలని జిటిఆర్‌ఐ ఫౌండర్‌ అజయ్ శ్రీవాస్తవా పేర్కొన్నారు.

➡️