ఐకార్‌-ఐఐఆర్‌ఆర్‌కు రూ.4.5 కోట్ల మద్దతు

Mar 28,2024 07:43 #Business, #SBI

మంచికళలు ఎన్‌జిఒకు సాయం అందించిన ఎస్‌బిఐ ఎండి చల్లా శ్రీనివాసులు

హైదరాబాద్‌ : స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా తన కార్పొరేట్‌ సామాజిక బాధ్యత (సిఎస్‌ఆర్‌)ను కొనసాగిస్తోంది. బుధవారం హైదరాబాద్‌కు అధికారిక పర్యాటనకు వచ్చిన ఎస్‌బిఐ మేనేజింగ్‌ డైరెక్టర్‌ (ఇంటర్నేషనల్‌ బ్యాంకింగ్‌, గ్లోబల్‌ మార్కెట్స్‌ అండ్‌ టెక్నాలజీ) చల్లా శ్రీనివాసులు శెట్టి పలు కార్యక్రమాల్లో పాల్గన్నారు. కోటిలోని లోకల్‌ హెడ్‌ ఆఫీసులో ఐకార్‌ాఐఐఆర్‌ఆర్‌తో జరిగిన ఎస్‌బిఐ ఫౌండేషన్‌ ఒప్పందానికి హాజరయ్యారు. సికింద్రాబాద్‌లోని మారేడుపల్లిలో అనాథ పిల్లలకు ఆశ్రయం కల్పించే ‘మంచికళలు’ ఎన్‌జిఒకు టాటా వింగర్‌ మినిబస్‌ను అందించారు. మంచికళలు ఫౌండర్‌ ప్రెసిడెంట్‌ శరత్‌ కుమార్‌ పుప్పలకు వాహన తాళం చెవులను బహుకరించారు.”శరత్‌ కుమార్‌ సేవలు ప్రశంసనీయం. కార్పొరేట్‌ సామాజిక సేవ కోసం చెక్కులు రాయడం సులభమే.. కానీ సరైనా ఎన్‌జిఒను గుర్తించి సాయం చేయడమే క్లిష్టమైన అంశం. ఎస్‌బిఐ ఫౌండేషన్‌ ద్వారా అడవి ప్రాంతాల్లోని 112 జిల్లాల్లో మొబైల్‌ హాస్పిటళ్లను ఏర్పాటు చేయాలనేది మా సంకల్పం.” అని సిఎస్‌ శెట్టి అన్నారు. ఐకార్‌-ఐఐఆర్‌ఆర్‌కు ప్రొమోషన్‌ ఆఫ్‌ డైరెక్ట్‌ సీడెడ్‌ రైస్‌ (డిఎస్‌ఆర్‌) కోసం ఏకంగా రూ.4.5 కోట్ల విలువ చేసే చెక్కును ఆయన అందజేశారు. ఈ కార్యక్రమానికి ఎస్‌బిఐ హైదరాబాద్‌ సర్కిల్‌ సిజిఎం రాజేష్‌ కుమార్‌, ఎస్‌బిఐ పౌండేషన్‌ ఎండి సంజరు ప్రకాష్‌, ఉన్నతాధికారులు మంజూ శర్మ, దేబాశిష్‌ మిశ్రా, విద్యా రాజా, వి ప్రేమ్‌జీ తదితరులు హాజరయ్యారు.

➡️