ఈ ఏడాది 6.4 శాతం వృద్థి.. ఎస్‌అండ్‌పి అంచనా

Nov 28,2023 08:56 #Business

న్యూఢిల్లీ : ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత వృద్థి రేటు 6.4 శాతంగా ఉండొచ్చని ఎస్‌అండ్‌పి గ్లోబల్‌ రేటింగ్స్‌ అంచనా వేసింది. ఇంతక్రితం 6 శాతం అంచనాతో పోల్చితే 40 బేసిస్‌ పాయింట్లు పెంచింది. కాగా.. 2024-25 జిడిపి అంచనాలకు 50 బేసిస్‌ పాయింట్లు కోత పెట్టి.. 6.4 శాతంగా అంచనా వేసింది. అధిక ద్రవ్యోల్బణం, బలహీన ఎగుమతులు చోటు చేసుకున్నప్పటికీ దేశీయ డిమాండ్‌ పెరుగుదలతో ఈ ఏడాది జిడిపికి మద్దతు లభించనుందని పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వితీయార్థంలో ప్రపంచ వృద్థిలో రేటులో మందగమనం చోటు చేసుకోవచ్చని పేర్కొంది. ఇందుకు అధిక వడ్డీ రేట్లు, భౌగోళిక ఆందోళనలు కారణమని పేర్కొంది. కాగా 2025-26లో భారత జిడిపి 6.9 శాతం పెరుగొచ్చని పేర్కొంది.

➡️