ఎయిర్‌టెల్‌ పేమెంట్‌ బ్యాంక్‌ లాభాల్లో 60% వృద్థి

May 22,2024 21:15 #Business

న్యూఢిల్లీ : గడిచిన ఆర్థిక సంవత్సరం2023-24లో ఎయిర్‌టెల్‌ పేమెంట్‌ బ్యాంక్‌ 60 శాతం వృద్థితో రూ.35 కోట్ల నికర లాభాలు సాధించింది. బ్యాంక్‌ నెలసరి సగటు లావాదేవీలు 8.04 కోట్లుగా నమోదయ్యాయి. ఖాతాదారుల డిపాజిట్లు 50 శాతం పెరిగి రూ.2,801 కోట్లకు చేరాయి. స్థూల వ్యాపార విలువ రూ.2.5 లక్షల కోట్లుగా చోటు చేసుకుంది. అయితే పేమెంట్‌ బ్యాంక్‌లు రుణాలు జారీ చేయడానికి ఆర్‌బిఐ అనుమతి లేదు. తమ బ్యాంక్‌ 5 లక్షల టచ్‌ పాయింట్లకు చేరాయని ఆ సంస్థ తెలిపింది.

➡️