చిన్న పరిశ్రమల వృద్థికి ఎఐ కీలకం : మెటా

Jun 27,2024 21:39 #Business

న్యూఢిల్లీ : సూక్ష్మ, చిన్న, మధ్యతరహా (ఎంఎస్‌ఎంఇ)ల వృద్థికి కృత్రిమ మేధా (ఎఐ) మద్దతు ఎంతో అవసరం ఉందని మెటా పేర్కొంది. టెక్‌ ఎంఎస్‌ఎంఇలకు సాధికారత కల్పించేందుకు నాస్కామ్‌తో వ్యూహాత్మక భాగస్వామ్యం కుదర్చుకున్నట్లు పేర్కొంది. ప్రపంచ ఎంఎస్‌ఎంఇ దినోత్సవం సందర్భంగా ‘ఎంపవర్లింగ్‌ ఇండియాస్‌ గ్రోత్‌: టెక్‌-ఎనేబుల్డ్‌ ఎంఎస్‌ఎంఇలకు ఏఐ సామర్థాలను అన్‌లాక్‌ చేయడం” అనే శీర్షికతో నాస్కామ్‌, మెటా సంయుక్తంగా ఒక శ్వేతపత్రాన్ని విడుదల చేశాయి. ఇది టెక్‌ ఎంఎస్‌ఎంఇలకు తమ వ్యాపార కార్యకలాపాలలో ఎఐని స్వీకరించడంలో ఎదుర్కొంటున్న కీలక అవకాశాలు, సవాళ్లను విశ్లేషించింది.

➡️