నీట్‌పరీక్షను రద్దు చేయాలి

Jun 28,2024 19:59
నీట్‌పరీక్షను రద్దు చేయాలి

ఆందోళన చేస్తున్న పిడిఎస్‌యు విద్యార్థులునీట్‌పరీక్షను రద్దు చేయాలిప్రజాశక్తి-నెల్లూరు:దేశవ్యాప్తంగా వైద్య,విద్య కోర్సులలో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్‌. 2024.. ఎగ్జామ్‌ రద్దు చేయాలని పిడిఎస్‌యు ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా పిడిఎస్‌యు జిల్లా అధ్యక్షులు ఎం.సునీల్‌ మాట్లాడుతూ ఈమధ్య దేశ వ్యాప్తంగా జరిగిన నీట్‌ ఎగ్జామ్‌లో భారీ స్థాయిలో అవినీతి అక్రమాలు జరిగాయని తెలిపారు. కష్టపడి చదివిన విద్యార్థులకు సీట్లు రాకుండా చదువురాని విద్యార్థులకు సీట్ల వచ్చే విధంగా కొంతమంది వ్యక్తులు చేశారు. ఈ వ్యక్తులను కఠినంగా శిక్షించాలన్నారు. పేపర్‌ లీకేజీ కారణమైన ఎన్‌టి ఏ సంస్థను రద్దు చేయాలన్నారు. సిబిఐ చేత పూర్తిస్థాయిలో ఎంక్వైయిరీ చేసి బాధ్యులకు శిక్ష పడే విధంగా చేయాలన్నారు. వెంటనే నీట్‌ పరీక్షను రద్దుచేసి మరలా ఎగ్జామ్‌ నడిపించాలని పిడిఎఫ్‌ డిమాండ్‌ చేస్తుందన్నారు. దేశంలో నరేంద్ర మోడీ కేంద్ర విద్యా శాఖ మంత్రి బాధ్యత తీసుకొని విద్యార్థులకు న్యాయం చేయాలన్నారు. పేపర్‌ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యా శాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు షారుఖ్‌.. టౌన్‌ అధ్యక్షులు ఆశిర్‌, టౌన్‌ సభ్యులు ఎస్‌.కె ఖాదర్‌బాషా, మనోజ్‌, వంశీ, విద్యార్థులు పాల్గొన్నారు.

➡️