ఎగిసిన చమురు, బంగారం

May 21,2024 09:22 #Business, #crude oil
  • ఇరాన్‌ అధ్యక్షుడి మృతి ఎఫెక్ట్‌

న్యూఢిల్లీ : ఇరాన్‌ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ అజర్‌ బైజాన్‌ హెలికాప్టర్‌ ప్రమాదంలో మృతి చెందడంతో చమురు, బంగారం ధరలు పెరిగాయి. రైసీ మరణ వార్తతో వెంటనే సోమవారం చమురు ఎక్కువ ఉత్పత్తి చేసే మధ్యప్రాచ్య ప్రాంతంలో రాజకీయ అనిశ్చితి నెలకొనడంతో చమురు ధరలు పెరిగిపోయాయి. అంతర్జాతీయంగా బంగారం ధరలు కూడా ఎగిశాయి. ఆల్‌ టైమ్‌ గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. స్పాట్‌ బంగారం ఔన్సు ధర 1 శాతం పెరిగి 2,438.44 డాలర్లకు చేరుకుంది. యుఎస్‌ గోల్డ్‌ ఫ్యూచర్స్‌ 1.1 శాతం పెరిగి 2,442.60 డాలర్లుగా నమోదయ్యింది. గ్లోబల్‌ అనిశ్చితులు ఏర్పాడితే ఇన్వెస్టర్లు పసిడిపై పెట్టుబడులను సురక్షితంగా భావించడంతో ఆ లోహానికి డిమాండ్‌ పెరుగుతంది. చమురు బ్యారెల్‌కు 41 సెంట్లు లేదా 0.5 శాతం పెరిగి 84.39 డాలర్లకు చేరుకుంది.

➡️