శూన్య కార్బన్‌ భవిష్యత్తుపై సిమెంట్‌ రంగం దృష్టి

May 25,2024 22:29 #Business

హైదరాబాద్‌ : నికర శూన్య కార్బన్‌ లక్ష్యాన్ని చేరాలని నిర్దేశించుకున్నట్లు గ్రీన్‌ సిమెంటెక్‌ 2024 ఛైర్మన్‌, జెకె సిమెంట్‌ లిమిటెడ్‌ డిప్యూటీ మేనేజింగ్‌ డైరెక్టర్‌, సిఇఒ మాధవకృష్ణ అన్నారు. సిఐఐ గ్రీన్‌ సిమెంటెక్‌ 2024 సదస్సు 20వ ఎడిషన్‌ హైదరాబాద్‌లోని హెచ్‌ఐసిసిలో రెండు రోజుల పాటు జరిగింది.
సిమెంట్‌ మాన్యుఫాక్చరర్స్‌ అసోసియేషన్‌ (సిఎంఎ) భాగస్వామ్యంతో సిఐఐ వార్షిక సిమెంటు రంగ సదస్సును ఏర్పాటు చేసింది. ఇందులో మాధవకృష్ణ మాట్లాడుతూ.. హరిత భవిష్యత్తు దిశగా సిమెంటు రంగం ప్రయాణాన్ని తీర్చిదిద్దేందుకు సిఐఐ గ్రీన్‌ సిమెంటెక్‌ ఆవిష్కరణలు, చర్చలు, భాగస్వామ్యం తదితర అంశాల్లో కీలకంగా వ్యవహారిస్తుందన్నారు.

➡️