గ్రాన్యూల్స్‌ విశాఖ యూనిట్‌లో ఎఫ్‌డిఎ తనిఖీలు

Apr 13,2024 21:20 #Business

హైదరాబాద్‌ : ప్రముఖ ఔషధ ఉత్పత్తుల కంపెనీ గ్రాన్యూల్స్‌ ఇండియాకు చెందిన విశాఖపట్నం అనకాపల్లిలోని యూనిట్‌లో అమెరికా ఫుడ్‌ అండ్‌ డ్రగ్‌ అడ్మినిస్ట్రేషన్‌ (యుఎస్‌ ఎఫ్‌డిఎ) తనిఖీలు పూర్తి చేసింది. ఏప్రిల్‌ 8 నుంచి 12వ తేదీ మధ్య విజయవంతంగా తనిఖీలు పూర్తి చేసిందని గ్రాన్యూల్స్‌ పేర్కొంది. 483 పరిశీలనలతో జీరో అని తేలిందని వెల్లడించింది. ఈ ఆడిట్‌ ఆంకాలజీ, నాన్‌ ఆంకాలజీ ఉత్పత్తుల కోసం యాక్టివ్‌ ఫార్మాస్యూటికల్‌ ఇంగ్రిడియంట్స్‌ (ఎపిఐ), ఫార్ములేషన్స్‌ (ఎఫ్‌డిలు) కోసం ప్రీ అప్రూవల్‌ ఇన్‌స్పెక్షన్‌ (పిఎఐ), సిజిఎంపి ఆడిట్‌కు ఉద్దేశించినవని గ్రాన్యూల్స్‌ ఇండియా ఎండి కృష్ణ ప్రసాద్‌ తెలిపారు. తమ యూనిట్‌కు జీరో అబ్జర్వేషన్‌ సర్టిఫికెట్‌ లభించడమంటే అధిక నాణ్యత ప్రమాణాలు, అత్యుత్తమ ప్రపంచ ప్రమాణాలతో పోల్చదగినదన్నారు. మరిన్ని ఆరోగ్య సంరక్షణను మెరుగుపరిచే ఉత్పత్తులను తయారు చేస్తూ ముందుకు సాగుతామని తెలిపారు.

➡️