భారీ నష్టాల్లోంచి.. తుదకు లాభాలు..

May 13,2024 22:43 #Business

సెన్సెక్స్‌ 112 పాయింట్ల ర్యాలీ
ముంబయి : కొనుగోళ్ల మద్దతుతో దేశీయ స్టాక్‌ మార్కెట్లు సోమవారం లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాలతో బిఎస్‌ఇ సెన్సెక్స్‌ తుదకు 112 పాయింట్ల లాభంతో 72,776 వద్ద ముగిసింది. ఎన్‌ఎస్‌ఇ నిఫ్టీ 49 పాయింట్లు రాణించి 22,104కు చేరింది. ఉదయం నష్టాల్లో ప్రారంభమైన సూచీలు.. కొనుగోళ్ల మద్దతుతో మధ్యాహ్నం తర్వాత పుంజుకున్నాయి. ఉదయం 72,477 పాయింట్ల వద్ద నష్టాల్లో ప్రారంభమై.. ఓ దశలో 71,866 కనిష్ఠాన్ని తాకింది. ఇంట్రాడే కనిష్ఠాల నుంచి సెన్సెక్స్‌ 910 పాయింట్ల మేర పుంజుకోవడం విశేషం. సెన్సెక్స్‌ 30 సూచీలో ఏషియన్‌ పెయింట్స్‌, సన్‌ఫార్మా, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌, టిసిఎస్‌, యాక్సిస్‌ బ్యాంక్‌ షేర్లు అధికంగా లాభపడిన వాటిలో ముందు వరసలో ఉన్నాయి.

➡️