షార్ప్‌ మల్టీఫంక్షనల్‌ ప్రింటర్‌ ఆవిష్కరణ

May 21,2024 21:30 #Business

న్యూఢిల్లీ : జపాన్‌కు చెందిన షార్ప్‌ కార్పొరేషన్‌ భారత అనుబంధ సంస్థ షార్ప్‌ బిజినెస్‌ సిస్టమ్స్‌ (ఇండియా) తమ నూతన కాంపాక్ట్‌ కలర్‌ మల్టీఫంక్షనల్‌ ప్రింటర్‌ ఎంఇపి బిపిాసి533డబ్ల్యుడిని ఆవిష్కరించింది. దీంతో పాటు ఇంటరాక్టివ్‌ వైట్‌బోర్డ్‌ పిఎన్‌ాఎల్‌సి752, పిఎన్‌ఎల్‌సి862లను విడుదల చేసినట్లు వెల్లడించింది. కొత్త కాంపాక్ట్‌ ఎంఇపి ఎ3 కలర్‌ మల్టీ ఫంక్షన్‌ ప్రింటర్‌ల గరిష్ట సామరర్థ్యాలను కలిగి ఉందని షార్ప్‌ బిజినెస్‌ సిస్టమ్స్‌ ఇండియా ఎండి ఒసాము నరిటా పేర్కొన్నారు. ఎంఇపి ధరను రూ.2.72 లక్షలుగా, ఇంటరాక్టివ్‌ వైట్‌బోర్డు ధరను రూ.4,92,000గా ప్రకటించింది.

➡️