టాటా కాపిటల్‌తో ఎంజి మోటార్‌ ఒప్పందం

Jun 18,2024 21:25 #Business

న్యూఢిల్లీ : ఛానల్‌ ఫైనాన్స్‌ ఆప్షన్స్‌ మెరుగుపరచడానికి టాటా కాపిటల్‌తో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు జెఎస్‌డబ్ల్యు ఎంజి మోటార్‌ ఇండియా వెల్లడించింది. దీంతో తమ వాహన కొనుగోలుదారులకు సులభంగా రుణాలు, సరళమైన తిరిగి చెల్లింపుల అవధి, పోటీయుత వడ్డీతో అనుకూలంగా రూపొందించబడిన ఫైనాన్సింగ్‌ ఆప్షన్స్‌ లభించనున్నాయని ఆ సంస్థ పేర్కొంది. ఈ ఒప్పందంపై టాటా కాపిటల్‌ ఎస్‌ఎంఇ సిఒఒ నరేంద్ర కామత్‌, జెఎస్‌డబ్ల్యు ఎంజి మోటార్‌ ఇండియా చీఫ్‌ కమర్షియల్‌ ఆఫీసర్‌ సుతీందర్‌ సింగ్‌ బజ్వా సంతకాలు చేశారు.

➡️