ఆరేళ్ల గరిష్టానికి పి నోట్స్‌

May 6,2024 21:10 #Business

ముంబయి : భారత స్టాక్‌ మార్కెట్లలో ఫిబ్రవరి ముగింపు నాటికి పార్టిసిపేటరీ నోట్స్‌ (పి-నోట్స్‌) పెట్టుబడులు రూ.1.5 లక్షల కోట్లతో.. ఆరేళ్ల గరిష్ట స్థాయికి ఎగిశాయి. ఎలాంటి రిజిస్ట్రేషన్‌, గుర్తింపు లేకుండా విదేశీ ఇన్వెస్టర్లు పి-నోట్స్‌లో పెట్టుబడులు పెడతారు. జనవరి ముగింపు నాటికి రూ.1,43,011 కోట్లుగా ఉన్న పి-నోట్స్‌.. ఫిబ్రవరి ముగింపు నాటికి రూ.1,49,517 కోట్లకకు చేరాయని సెబీ గణంకాలు వెల్లడించాయి. 2017 జూన్‌లో రూ.1.65 లక్షల కోట్లతో గరిష్ట పెట్టుబడులు నమోదయ్యాయి.

➡️