పిట్టీ ఇంజనీరింగ్‌కు రూ.40 కోట్ల లాభాలు

May 18,2024 20:56 #Business

హైదరాబాద్‌ : ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికంలో 62 శాతం వృద్థితో రూ.40.36 కోట్ల నికర లాభాలు సాధించినట్లు పిట్టీ ఇంజనీరింగ్‌ తెలిపింది. ఇంతక్రితం ఏడాది ఇదే క్యూ4లో రూ.24.84 కోట్ల లాభాలు నమోదు చేసింది. ఇదే సమయంలో రూ.247.50 కోట్లుగా ఉన్న రెవెన్యూ.. గడిచిన క్యూ4లో 32.48 శాతం పెరిగి రూ.327.88 కోట్లకు చేరింది. 2023-24లో మొత్తంగా కంపెనీ లాభాలు 53.32 శాతం వృద్థితో రూ.90.20 కోట్లుగా.. రెవెన్యూ 9.22 శాతం పెరిగి రూ.1,201.60 కోట్లుగా నమోదయ్యింది.

➡️