ఆర్‌బిఐ ఎంపిసి భేటీ ప్రారంభం

Jun 5,2024 22:45 #Business, #meating, #RBI

న్యూఢిల్లీ : రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్షా బుధవారం ప్రారంభమైంది. మూడు రోజుల పాటు సాగనున్న మానిటరీ పాలసీ కమిటీ (ఎంపిసి) సమావేశాలు జూన్‌7న ముగియనున్నాయి. దేశంలో ఇప్పటికీ ద్రవ్యోల్బణం కట్టడిలో లేనందున మరోమారు కీలక వడ్డీ రేట్లను తగ్గించకపోవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఆరుగురు సభ్యులతో కూడిన ఈ భేటీలో రెపోరేటును 6.5 శాతం వద్దే కొనసాగించే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు.

➡️