సోనీ బ్రావియా-2 విడుదల

May 23,2024 21:24 #Business

ప్రజాశక్తి -విజయవాడ (హైల్త్‌ యూనివర్సిటీ) :సోనీ కంపెనీ నుండి సరికొత్తగా బ్రావియా 2 సిరీస్‌ టివిని మార్కెట్లోకి తీసుకువచ్చినట్లు సంస్థ ప్రతినిధి ఎల్‌. ఈశ్వర్‌ తెలిపారు. ఎం.జి.రోడ్డులోని సోనీ షోరూమ్‌లో బ్రావియా టివిల పరిచయ కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 4కె అల్ట్రా హెచ్‌డి, ఎల్‌ఇడి డిస్‌ప్లే సాంకేతిక ఉందన్నారు. గేమింగ్‌ సెషన్స్‌ కూడా అందుబాటులో ఉండే విధంగా ప్రత్యేకంగా రూపొందించామన్నారు. బ్రావియా 2 సిరీస్‌ అద్భుతమైన వీక్షణ అనుభవాన్ని అందిస్తుందని తెలిపారు. బ్రావియా 2 సిరీస్‌ ఎస్‌-25 వేరియంట్‌ ఇది అసమానమైన గేమింగ్‌ సామర్థ్యాలను అందిస్తుందని తెలిపారు. వీటితో పాటు ఇతర ఫీచర్లు కూడా ఉన్నాయని తెలిపారు. సోనీ షోరూమ్‌లతో పాటు అన్ని ఎలక్ట్రానిక్స్‌ షోరూమ్‌లో అందుబాటులో ఉంటుందని తెలిపారు.

➡️