బజాజ్‌ ఫైనాన్స్‌తో టాటా మోటార్స్‌ జట్టు

May 21,2024 21:20 #Business

ముంబయి : ఫైనాన్సింగ్‌ ఎంపికలను మెరుగుపరచడానికి, సులభతరం చేసే ప్రయత్నంలో భాగంగా టాటా మోటార్స్‌ కొత్తగా బజాజ్‌ ఫైనాన్స్‌తో భాగస్వామ్యం కుదర్చుకుంది. టాటా అనుబంధ సంస్థలైన టాటా మోటార్స్‌ ప్యాసింజర్‌ వెహికల్స్‌ (టిటిపివి), టాటా ప్యాసింజర్‌ ఎలక్ట్రిక్‌ మొబిలిటీ (టిపిఇఎం) సంస్థలు బజాజ్‌ బజాజ్‌ ఫైనాన్స్‌తో చేతులు కలిపినట్లు పేర్కొన్నాయి. ఈ ఒప్పందంపై టిపిఇఎం సిఎఫ్‌ఒ ధీమన్‌ గుప్తా, బజాజ్‌ ఫైనాన్స్‌ చీఫ్‌ బిజినెస్‌ ఆఫీసర్‌ సిద్ధార్థ భట్‌ సంతకం చేశారు. తమ డీలర్‌ భాగస్వాముల కార్యకలాపాలను సులభతరం చేయడంలో వారికి సహాయపడే ఫైనాన్స్‌ పరిష్కారాల కోసం చురుకుగా పని చేయడం తమకు సంతోషంగా ఉందని ధీమన్‌ పేర్కొన్నారు.

➡️