టాటా టెక్‌ ఇష్యూకు భలే క్రేజీ

Nov 22,2023 21:15 #Business

తొలి రోజు 6.5 రెట్ల స్పందన
ముంబయి : టాటా గ్రూపు నుంచి దాదాపుగా 19 ఏళ్ల తర్వాత తొలిసారి ఇష్యూకు వచ్చిన టాటా టెక్నాలజీస్‌కు ఇన్వెస్టర్లలో చాలా ఆసక్తి నెలకొంది. బుధవారం ప్రారంభమైన టాటా టెక్నాలజీస్‌ ఇన్షియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌ (ఐపిఒ)కు అనుహ్యా డిమాండ్‌ వచ్చింది. తొలి గంటలోనే 4.50 కోట్ల షేర్లకు సబ్‌స్క్రిప్షన్‌ వచ్చింది. ఈ ఇష్యూలో ద్వారా రూ.3042.5 కోట్లు సమీకరించాలని ఆ కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. టాటా మోటార్స్‌కు చెందిన టాటా టెక్నాలజీస్‌ ఇంజినీరింగ్‌, ప్రొడక్ట్‌ డెవలప్‌మెంట్‌ డిజిటల్‌ సర్వీసెస్‌ సంస్థ, జాగ్వార్‌ ల్యాండ్‌రోవర్‌ సహా టాటా గ్రూప్‌లోని ఇతర సంస్థలకు ఇది ప్రధానంగా సేవలందిస్తోంది. ఈ ఐపిఒలో భాగంగా టాటా మోటార్స్‌ 11.4 శాతం వాటాకు సమానమైన షేర్లను విక్రయించనుంది. మంగళవారం యాంకర్‌ ఇన్వెస్టర్ల నుంచి టాటా టెక్‌ రూ.791 కోట్లు సమీకరించింది. నవంబర్‌ 24 నాటితో ఈ ఇష్యూకు దరఖాస్తు ముగియనుంది. తొలి రోజు ఇష్యూలో 6.54 రెట్ల స్పందన వచ్చిందని మార్కెట్‌ వర్గాలు వెల్లడించాయి.

➡️