కొత్త వ్యాపారాల్లోకి వివాంటా

Dec 25,2023 20:37 #Business
  • ఇండిస్టీస్‌టెక్‌, ఇవి చార్జింగ్‌ విభాగాల్లోకి ప్రవేశం

అహ్మాదాబాద్‌ : వివాంటా ఇండిస్టీస్‌ ఆధునిక వ్యాపారాలపై దృష్టి పెడుతున్నట్లు ప్రకటించింది. డ్రోన్‌, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, ఎఐ, రోబోటిక్స్‌, విద్యుత్‌ వాహన ఛార్జింగ్‌ స్టేషన్ల తదితర కొత్త వ్యాపారాల్లోకి అడుగుపెడుతున్నట్లు వెల్లడించింది. ఈ లిస్టెడ్‌ కంపెనీ ప్రస్తుతం కాన్సెప్ట్‌ నుంచి అమలు వరకు ప్రాజెక్టులకు కన్సల్టెన్సీ, టర్న్‌ కీ సొల్యూషన్స్‌ అందిస్తోంది. తమ కంపెనీ ఇప్పటికే డ్రోన్‌, ఇవి వ్యాపారంపై పనిని ప్రారంభించినట్లు పేర్కొంది. రాబోయే కాలంలో దీనిని పెద్దది చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు పేర్కొంది. 2023 సెప్టెంబర్‌లో వివాంటా డ్రోన్‌ రీసెర్చ్‌ సెంటర్‌ టాంజానియా లిమిటెడ్‌తో ప్రాథమిక ఎంఒయు కుదుర్చుకున్నట్లు పేర్కొంది. అసెంబ్లీ లైన్‌ ఏర్పాటుతో పాటు డ్రోన్ల ఆర్‌అండ్‌డి కోసం విడిఆర్‌ సిటిఎల్‌లో 50 శాతం వాటాను వివాంటా ఇండిస్టీస్‌ లిమిటెడ్‌ కొనుగోలు చేయనున్నట్లు వెల్లడించింది. ఆఫ్రికా ఖండం నుంచి గణనీయమైన వ్యాపార అవకాశాన్ని కంపెనీ ఆశిస్తోంది. ప్రాజెక్టును వేగవంతం చేయాలని చూస్తోన్నట్లు తెలిపింది.

➡️