ఆరు నెలల్లో స్వర్ణకార కార్పొరేషన్‌ ఏర్పాటు – స్వర్ణకారులకు లోకేష్‌ హామీ

Jun 25,2024 20:30 #Nara Lokesh, #speech

ప్రజాశక్తి – మంగళగిరి ( గుంటూరు జిల్లా) :ఆరు నెలల్లో స్వర్ణకార కార్పొరేషన్‌ ఏర్పాటు చేసి కార్మికులను, స్వర్ణకారులను ఆదుకుంటామని మంత్రి నారా లోకేష్‌ హామీ ఇచ్చారు. గుంటూరు జిల్లా ఉండవల్లిలోని లోకేష్‌ నివాసంలో మంగళవారం జరిగిన ప్రజా దర్బార్లో ఆయనను మంగళగిరికి చెందిన లక్ష్మీ నరసింహా గోల్డ్‌ స్మిత్‌ వెల్ఫేర్‌ సొసైటీ ప్రతినిధులు కలిశారు. తమ సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఈ సందర్భంగా లోకేష్‌ మాట్లాడుతూ స్వర్ణకార కార్పోరేషన్‌ ఏర్పాటుకు సంబంధించిన విధివిధానాలు ఏ విధంగా ఉండాలి, స్వర్ణకారులు ఎదుర్కొంటున్న సమస్యలపై అధ్యయనం చేసి వివరాలు సమర్పించాలని సొసైటీ ప్రతినిధులకు సూచించారు. స్థానికంగా స్వర్ణకార వృత్తిపై ఆధారపడి అనేక మంది జీవనం సాగిస్తున్నారని, మంగళగిరిని గోల్డ్‌ హబ్‌గా రూపొందిస్తామనే హామీకి కట్టుబడి ఉన్నామని తెలిపారు. కార్పొరేషన్‌ ఏర్పాటు చేసి ఆధునిక సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు.

➡️