ఏడాదిలో 100 శాఖలు తెరుస్తాం

May 22,2024 21:10 #Business

ఆయోద్యలో 840 శాఖ ఏర్పాటు
కెవిబి సిఇఒ రమేష్‌ బాబు వెల్లడి
ఆయోద్య : ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024-25)లో కొత్తగా 100 శాఖలను తెరువాలని లక్ష్యంగా పెట్టుకున్నామని కరూర్‌ వైశ్యా బ్యాంక్‌ (కెవిబి) ఎండి, సిఇఒ ఆర్‌ రమేష్‌ బాబు తెలిపారు. బుధవారం ఆయోధ్యలో బ్యాంక్‌ 840వ శాఖను ఛైర్‌పర్సన్‌ మీనా హేమచంద్రతో కలిసి లాంచనంగా ప్రారంభించారు. ఈ సందర్బంగా రమేష్‌ బాబు మాట్లాడుతూ.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు కొత్తగా 39 శాఖలను ప్రారంభించామన్నారు. 2024 మార్చి 31తో ముగిసిన ఏడాదిలో కెవిబి రూ.1,605 కోట్ల నికర లాభాలు సాధించింది. నికర నిరర్థక ఆస్తులు 0.40 శాతానికి తగ్గాయి. ఆస్తులు, లాభదాయకత అంశంలో బ్యాంక్‌ మెరుగైన ఫలితాలను సాధిస్తుందని రమేష్‌ బాబు అన్నారు. నూతన శాఖ ప్రారంభోత్సవంలో కెవిబి సీనియర్‌ అధికారులు కెఎస్‌ రవీచంద్రన్‌, ఆర్‌ రాంకుమార్‌, కెజి మోహన్‌, మురళి రామస్వామి, ఆర్‌ విద్యా శంకర్‌, సిబ్బంది పాల్గొన్నారు.

➡️