విద్యుదాఘాతంతో రైతు మృతి

Jun 21,2024 00:15 #death, #electric shock, #rythu

నార్పల : అనంతపురం జిల్లా నార్పల మండల పరిధిలోని బొందలవాడ గ్రామంలో రైతు చంద్రమౌళి (48) గురువారం విద్యుదాఘాతంతో మృతిచెందారు. స్థానికులు తెలిపిన వివరాల మేరకు… పంటకు నీరు పెట్టేందుకు తోటకు వెళ్లారు. మోటార్‌ ఆన్‌ చేస్తుండగా స్టార్టర్‌ బాక్స్‌కు విద్యుత్‌ సరఫరా కావడంతో షాక్‌కు గురై చంద్రమౌళి అక్కడికక్కడే మృతిచెందారు. ఉదయం తోటకు వెళ్లిన కుటుంబీకులు గమనించి బోరున విలపించారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఎస్‌ఐ రాజశేఖర్‌రెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అనంతపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతుని తండ్రి వన్నూరప్ప ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

➡️