అంగన్‌వాడీలకు ఉపాధ్యాయుల మద్దతు

Jan 9,2024 23:36
అంగన్‌వాడీల సమ్మె

ప్రజాశక్తి – యంత్రాంగం

అంగన్‌వాడీల సమ్మె మంగళవారానికి 29వ రోజుకు చేరింది. కాకినాడ కలెక్టరేట్‌ సమీపంలోని ధర్నా చౌక్‌ వద్ద 24 గంటల నిరహారదీక్షను కొనసాగించారు. ఉపాధ్యాయులు పాల్గొని అంగన్‌వాడీలకు మద్దతు తెలిపారు. ఉమ్మడిగా ప్రభుత్వానికి బుద్దివచ్చేలా పోరాటా లను సాగించాలని పిలుపునిచ్చారు. అలాగే పలు మండ లాల్లోనూ రిలే నిరహారదీక్షలు కొనసాగాయి. కాకినాడ అంగన్‌వాడీలు గత 29 రోజులుగా చేస్తున్న ఉద్యమానికి ఉపాధ్యాయులు మద్దతు తెలిపారు. స్థానిక ధర్నా చౌక్‌ వద్ద జరుగుతున్న నిరసన శిబిరంలో 24 గంటల రిలే నిరాహార దీక్షల నాలుగోరోజు శిబిరాన్ని సిఐటియు జిల్లా అధ్యక్షులు దువ్వ శేషాబాబ్జి, పెద్దాపురం ప్రాజెక్ట్‌ కార్యదర్శి దాడి బేబి, ఆశా వర్కర్స్‌ యూనియన్‌ అధ్యక్షురాలు నర్ల ఈశ్వరి ప్రారంభించారు. ఈ సందర్భంగా అంగన్‌వాడీల పోరాటానికి యుటిఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి అరుణకుమారి, యుటిఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి చక్రవర్తి మాట్లాడుతూ తెలంగాణ కంటే అదనంగా వేతనం చెల్లిస్తానని, అంగన్‌వాడీలని జగన్‌ ఎలాగైతే నమ్మించి మోసం చేశాడో, ఉద్యోగ, ఉపాధ్యాయులను కూడా సిపిఎస్‌ వారం రోజుల్లో రద్దు చేస్తానని ఓట్లు వేయించుకుని అధికారం లోకి రాగానే మాట తప్పి మాపై కూడా నిర్బంధాన్ని విధించాడని తెలిపారు. ఉద్యోగ, ఉపాధ్యాయులకు చెల్లిం చాల్సిన డిఎ బకాయిలు రూ.18 వేల కోట్లు ప్రభుత్వ అవసరాలకు దారి మళ్లించారాని విమర్శించారు. జగన్‌ ప్రభుత్వ నిర్బంధాన్ని అంద రం కలిసి ఎదుర్కొందామని, ఐక్య పోరాటాలు నిర్వహిద్దామని అం గన్‌వాడీలకు పిలుపునిచ్చారు. 29వ రోజు శిబిరానికి ఆమ్‌ ఆద్మీ పార్టీ జిల్లా కన్వీనర్‌ నరాల శివ, సామర్లకోట సిఐటియు కార్యదర్శి సురేష్‌, యు కొత్తపల్లి సిఐటియు కార్యదర్శి సత్యన్నారాయణ, కళ్ళ నాగేశ్వరరావు, జనసేన పార్టీ జిల్లా కన్వీనర్‌ పిట్టా జానకి రామారావు మద్దతు తెలిపారు. 4వ రోజు 24 గంటల దీక్షలలో ఎస్తేరు రాణి, పి.నాగమణి, ఎ. అమలావాతి, రాష్ట్ర కార్యదర్శి బాలం లక్ష్మీ, ఎస్‌.కె ఫాతిమా, పి.మహాలక్ష్మి, కె.రజని, పాల్గొన్నారు. జగ్గంపేట రూరల్‌ స్థానికంగా నిర్వహిస్తున్న అంగన్‌వాడీల సమ్మెకు సిపిఐఎంఎల్‌ లిబరే షన్‌ జిల్లా కార్యదర్శి ఏగుపాటి అర్జునరావు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా అర్జున రావు మాట్లాడుతూ సిఎం జగన్‌ ఎన్నికల ముందు అంగన్‌వాడీలకు ఇచ్చిన హామీలు తక్షణం నెరవేర్చాలని డిమాండ్‌ చేశారు. అంగన్‌ వాడీలపై ఎస్మా చట్టం ప్రయోగాన్ని ఉపసంహ రించుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్‌ లిబరేషన్‌ జిల్లా కమిటీ సభ్యులు జక్కంపూడి రాజు తదితరులు పాల్గొన్నారు తాళ్ళరేవు అంగన్‌వాడీలు త్వరలోనే తీపి కబురు వింటారని ఎంఎల్‌ఎ పొన్నాడ వెంకట సతీష్‌ కుమార్‌ అన్నారు. మంగళవారం పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ఆయన ఎంపిడిఒ కార్యాలయం వద్ద అంగన్‌వాడీలు చేస్తున్న నిరసన శిబిరాన్ని సందర్శిం చారు. ఈ సందర్భంగా యూనియన్‌ నాయకులు పి.ఆదిలక్ష్మి ఆయనకు వినతిపత్రాన్ని అందించారు. అంగన్‌వాడీలు ఎదుర్కొంటున్న సమస్య లను వివరించారు. పొన్నాడ మాట్లాడుతూ అంగన్‌వాడీ కార్య కర్తలు చేస్తున్న డిమాండ్లు న్యాయబద్ధంగా ఉన్నా యన్నారు. వాటి పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని, త్వరలోనే సిఎం నోట తీపి కబురు వింటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి రాయుడు సునీత, జడ్‌పిటిసి దొమ్మేటి సాగర్‌, రాయుడు గంగాధర్‌, కాశీ లక్ష్మణస్వామి, మైదు హరిబాబు తదితరులు ఉన్నారు. కరప సమస్యల పరిష్కారం కోరుతూ అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ నిరవధిక సమ్మె మంగళవారం నాటికి 29వ రోజుకు చేరింది. స్థానిక తహశీల్దార్‌ కార్యాలయం వద్ద జరిగిన నిరసన దీక్షలో ప్రాజెక్టు నాయకురాలు పి.వీరవేణి మాట్లాడుతూ సమస్యలు పరిష్కారం అయ్యేంతవరకు సమ్మెను విరమించేది లేదన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్‌.వరలక్ష్మి, ఎస్‌ఎస్‌.కుమారి, దైవకుమారి, అచ్చారత్నం, కల్పలత, సత్యమాధవి తదితరులు పాల్గొన్నారు.

➡️