అంగన్వాడీలకు డ్వాక్రాలు మద్దతుగా నిలవాలి : ఐద్వా

Jan 19,2024 00:59

బహుమతులు అందజేస్తున్న రమాదేవి
ప్రజాశక్తి-తాడేపల్లి : తమ సమస్యల పరిష్కారానికి నిరవధిక నిరాహార దీక్షలు చేపట్టిన అంగన్వాడీల పోరాటానికి డ్వాక్రా మహిళలు సంఘీభావం తెలిపి, మద్దతుగా నిలవాలని ఐద్వా రాష్ట్ర కార్యదర్శి డి.రమాదేవి కోరారు. తాడేపల్లి సుందరయ్య నగర్‌లోని మానికొండ సూర్యవతి ఎస్‌ఎల్‌ఎఫ్‌ డ్వాక్రా మహిళల సమావేశం గురువారం లీలాసుందరయ్య కళావేదిక వద్ద జరిగింది. సమావేశంలో రమాదేవి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఐద్వా నిర్వహించిన సర్వేలో వెలుగు చూసిన డ్వాక్రా మహిళల సమస్యలను వివరించారు. ఆ సమస్యలపై సంతకాలు సేకరించి అధికారుల దృష్టికి తీసుకు వెళ్లాలని కోరారు. గతంలో జగన్మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరుతూ అంగన్వాడీ కార్యకర్తలు చేస్తున్న పోరాటానికి విశాల మద్దతు కూడగట్టాలని కోరారు. సమావేశానికి స్థానిక మహిళా సంఘం కార్యదర్శి జ్యోతి అధ్యక్షత వహింఎఞవ ఐద్వా పట్టణ కార్యదర్శి పి.గిరిజ, పలు డ్వాక్రా గ్రూపుల మహిళలు పాల్గొన్నారు. అనంతరం ఇటీవల జరిగిన సంక్రాంతి ఆటల పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేశారు.

➡️