అంగన్‌వాడీల ఉద్యమంతో వైసిపి పతనం

Dec 17,2023 21:58 #TDP
ఫొటో : మాట్లాడుతున్న కోవూరు నియోజకవర్గ టిడిపి ఇన్‌ఛార్జి పోలంరెడ్డి దినేష్‌రెడ్డి

ఫొటో : మాట్లాడుతున్న కోవూరు నియోజకవర్గ టిడిపి ఇన్‌ఛార్జి పోలంరెడ్డి దినేష్‌రెడ్డి
అంగన్‌వాడీల ఉద్యమంతో వైసిపి పతనం
ప్రజాశక్తి-ఇందుకూరుపేటఅంగన్‌వాడీల ఉద్యమంతోనే వైసిపి పతనానికి నాంది అని కోవూరు నియోజకవర్గ టిడిపి ఇన్‌ఛార్జి పోలంరెడ్డి దినేష్‌రెడ్డి దుయ్యబట్టారు. ఆదివారం మండలంలోని పల్లిపాడు గ్రామంలో ప్రతీఅడుగు ప్రజలు కోసమే కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా పల్లిపాడు గ్రామస్తులు దినేష్‌ రెడ్డికి స్వాగతం పలికారు. అనంతరం ఇంటింటికి వెళ్లి టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వస్తే తాము చేసే ప్రజా సంక్షేమ కార్యక్రమాలు గూర్చి వివరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైసిపి ప్రభుత్వం ఏర్పడి నాలుగున్నర సంవత్సరం కావస్తున్న ప్రజలకు ఇచ్చిన హామీలు విస్మరించి అన్ని వర్గాల ప్రజల నుంచి వైసిపి ప్రభుత్వానికి వ్యతిరేకత ఉందన్నారు. అంగన్‌వాడీలకు ఇచ్చిన హామీలను ఇప్పటివరకు ఒక్కటి కూడా నెరవేర్చలేదన్నారు. అంగన్‌వాడీలకు తెలంగాణ కన్నా రూ.1000 ఎక్కువ ఇస్తానన్న జగన్మోహన్‌ రెడ్డి ఇప్పుడు వరకు ఆ ఊసే తేలేదన్నారు. అంగన్‌వాడీల కనీస డిమాండ్‌ లైన మౌలిక వసతులు, రూ.26వేల వేతనం, సుప్రీంకోర్టు ఆదేశానుసారం గ్రాడ్యుటీ, రిటైర్మెంట్‌ బెనెఫిట్స్‌ వంటి వాటిని అడిగితే ఇప్పటివరకు జగన్‌ ప్రభుత్వం వాటిని పట్టించుకున్న పపాన పోలేదన్నారు. టిడిపి హయాంలో 18401 కేంద్రాలను ఏర్పాటు చేసిన ఘనత తమ ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. నాడు-నేడు కింద అంగన్‌వాడీ భవనాలను ఆధునికీకరణ చేస్తానన్న జగన్మోహన్‌ రెడ్డి వాటిని విస్తరించారన్నారు. అంగన్‌వాడీల ఆర్తనాదాలు కనిపించలేదా అని ప్రశ్నించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే అంగన్‌వాడీల డిమాండ్స్‌ అన్ని నెరవేస్తామని హామీనిచ్చారు. పల్లిపాడు గ్రామంలో ముఖ్యంగా ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారని అధికారులను ఎన్నిసార్లు ప్రశ్నించిన నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. పనికిరాని కాగితాలను పెట్టుకుని ఇసుకను అక్రమంగా రవాణా చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో టిడిపి మండల అధ్యక్షులు రావెళ్ల వీరేంద్ర చౌదరి, జిల్లా కార్యనిర్వహక కార్యదర్శి చెంచు కిషోర్‌బాబు, జిల్లా టిడిపి అధికార ప్రతినిధి చెముకుల కష్ణ చైతన్య, రవీందర్‌ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

➡️