మానసిక వికలాంగులకు అన్నదానం

ప్రజాశక్తి-యర్రగొండపాలెం: యర్రగొండపాలెం పట్టణంలోని సన్‌జో సేవాలయంలో ఆశ్రయం పొందుతున్న మానసిక వికలాంగులకు ఆలేటి జాన్‌ సోసైటీ అధ్యక్షుడు ఆలేటి నాగయ్య తన పెళ్లి రోజు సందర్భంగా మంగళవారం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. నిత్యావసర వస్తువులను అందజేశారు. ఈ సందర్భంగా ఆలేటి నాగయ్య మాట్లాడుతూ మానసిక వికలాంగులకు మనవంతు తోడ్పాటు అందించే దిశగా మనందరం అడుగులు వేయాలని తెలిపారు. ఆలేటి జాన్‌ సొసైటీ ద్వారా ఇప్పటికే పలు కార్యక్రమాలు చేస్తున్నామని చెప్పారు. త్వరలో సొసైటీ ద్వారా ఒక ఆశ్రమాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సన్‌జో సేవాలయం ఫాదర్‌ సునీల్‌ కుమార్‌, సర్వేయర్‌ ఎలిశల దిలీప్‌ కుమార్‌, తూమాటి బ్రహ్మనాయుడు, ఆలేటి అనిల్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️