అంగన్‌వాడీల ఎస్మా ప్రతుల దహనం

అంగన్‌వాడీల ఎస్మా ప్రతుల దహనం

అంగన్‌వాడీలపై ఎస్మా ప్రయోగించడానికి నిరసనగా సోమవారం జిఒ ప్రతులను పలుచోట్ల దహనం చేశారు. ప్రజాశక్తి-యంత్రాంగంరామచంద్రపురం జిఒ ప్రతులను దహనం చేశారు. అంబేద్కర్‌ విగ్రహానికి వినతిపత్రం ఇచ్చి నిరసన తెలిపారు. రామచంద్రపురం, కె.గంగవరం మండలాలకు చెందిన 400 మంది అంగన్‌వాడీ వర్కర్లు మున్సిపల్‌ కార్యాలయం వద్ద ధర్నాలో పాల్గొన్నారు. సిఐటియు జిల్లా కార్యదర్శి నూకల బలరామ్‌, అంగన్‌వాడీ జిల్లా కార్యదర్శి ఎం.దుర్గమ్మ, ప్రాజెక్టు అధ్యక్షురాలు వి.వీరలక్ష్మి మాట్లాడారు. అనంతరం మెయిన్‌ రోడ్డు వరకూ ర్యాలీ నిర్వహించారు. వాసంశెట్టి సూర్యకుమారి, విజయలక్ష్మి, శ్రీదేవి, జహరా, దుర్గ, వెంకటరత్నం, గొంతి దేవి, వీరవేణి పాల్గొన్నారు.ముమ్మిడివరం ఐసిడిఎస్‌ కార్యాలయం వద్ద జయలక్ష్మి, దుర్గా మల్లేశ్వరి ఆధ్వర్యాన శిబిరంలో సిఎం జగన్‌ ఫోటోకు దండ వేసి, ఎస్మా ప్రతులను దహనం చేశారు. ధనలక్ష్మి, జి.శ్రీదేవి, వి.తలుపులమ్మ, ఎన్‌.విజయ కుమారి, కె.సత్యవతి, సుబ్బలక్ష్మి, హైమావతి, జి.మంగాయమ్మ, విజయరత్న, కుమారి, అంజనీదేవి, కనకదుర్గ పాల్గొన్నారు.మండపేట మున్సిపల్‌ కార్యాలయం వద్ద పోర్లు దండాలతో నిరసన తెలిపారు. ఆదిలక్ష్మి, బేబీ, రాణి, జానకి, సూర్యకుమారి, కుమారి, కష్ణ కుమారి పాల్గొన్నారు.కొత్తపేట మండల పరిషత్‌ కార్యాలయం వద్ద అంగన్‌వాడీల శిబిరానికి టిడిపి నాయకులు వచ్చి మద్దతు తెలిపారు. టిడిపి మండల అధ్యక్షుడు కంఠంశెట్టి శ్రీనివాసరావు, సర్పంచ్‌ బూసి జయలక్ష్మి భాస్కరరావు, మిద్దే ఆదినారాయణ, పార్టీ కొత్తపేట అధ్యక్షుడు వాసంశెట్టి సత్యనారాయణ, కరెళ్ల ప్రసాద్‌, అన్యం మునీశ్వరరావు, సీతారామరాజు, సలాది రవి, అన్యం వెంకటేష్‌ పాల్గొన్నారు. అనంతరం అంగన్‌వాడీలు అంబేద్కర్‌ విగ్రహానికి వినతిపత్రం ఇచ్చారు.మామిడికుదురు అంబేద్కర్‌ విగ్రహానికి వినతిపత్రం అందించారు.

➡️