అంగన్వాడీల నిరసనల ‘మోత’

ప్రజాశక్తి – యంత్రాంగం

జిల్లాలో అంగన్‌వాడీలు సమ్మె 15వ రోజు సోమవారం ఖాళీ కంచాలను గరిటెలతో మోగిస్తూ తమ ఆకలిబాధలు తీర్చాలంటూ వినూత్నంగా నిరసన తెలిపారు. పలుచోట్ల ఒంటికాలిపై, చెవిలో పూలతో నిరసన తెలిపారు. అలాగే జిల్లావ్యాప్తంగా అంగన్వాడీలు విధులు బహిష్కరించి యధావిధిగా సమ్మెను కొనసాగించారు. ప్రభుత్వం దిగొచ్చేవరకూ సమ్మెను ఆపేదిలేదంటూ వారంతా స్పష్టం చేశారు.ఏలూరు : అంగన్వాడీలు 15వ రోజు సమ్మెలో భాగంగా కలెక్టర్‌ ఆఫీస్‌ వద్ద కంచాలు మోగిస్తూ వినూత్నంగా నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సిఐటియు ఏలూరు నగర అధ్యక్షులు బి.జగన్నాధరావు మాట్లాడుతూ అంగన్వాడీలు నాలుగున్నరేళ్లుగా అనేకసార్లు ప్రభుత్వానికి తమ సమస్యలు పరిష్కరించాలని విన్నవించుకున్నప్పటికీ స్పందించకపోవడం వల్లే సమ్మె చేపట్టారన్నారు. వారి న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని కోరారు. ఈ సమ్మెకు ఆశా వర్కర్స్‌ యూనియన్‌ సంపూర్ణ మద్దతు తెలిపింది. ఈ సందర్భంగా అంగన్వాడీల యూనియన్‌ అధ్యక్షులు టి.రజని, కార్యదర్శి దుర్గాభవాని, పి.హైమావతి, మల్లిక, అరుణకుమారి, నవతి, సిఐటియు నగర కార్యదర్శి వి.సాయిబాబు, ఆశా వర్కర్స్‌ యూనియన్‌ నాయకురాలు టి.దుర్గ మాట్లాడారు. అనంతరం కలెక్టర్‌కు వినతిని అందించారు. ఈ కార్యక్రమంలో నాయకులు దేవి, విజయ, గీత, భవాని, లోకేశ్వరి, నవ్యరాణి పాల్గొన్నారు.కొయ్యలగూడెం : 15వ రోజు సమ్మెలో అంగన్వాడీలు కంచాలు మోగించి నిరసన తెలిపారు. ఈ కార్యక్రమానికి ఆశా వర్కర్స్‌ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షురాలు కె.పోచమ్మ సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఐసిడిఎస్‌ బలోపేతానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక బడ్జెట్‌ కేటాయించాలని కోరారు. కొయ్యలగూడెం రైస్‌ ఫీల్డ్‌ అండ్‌ బజార్‌ జట్టు వర్కర్స్‌ యూనియన్‌ నాయకులు సమ్మెకు సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలోనాయకులు కె.సీతారాములు, సిహెచ్‌.సత్యనారాయణ, వంక దుర్గారావు, వీర్రాజు, ఆకుల కనకారావు, ముళ్లపూడి సురేష్‌, మధు, ఎం.శివ, రత్నకుమారి, సునీతరారు, అడపా నాగజ్యోతి, పద్మజ, మంగ, రాజేశ్వరి పాల్గొన్నారు.భీమడోలు : అంగన్వాడీల సమ్మె 15 రోజుకు చేరింది. ఈ సందర్భంగా ఒంటికాలిపై నిలబడి గరిటెలతో కంచాలను మోగిస్తూ వినూత్నంగా నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీల యూనియన్‌ నాయకులు రాజామణి, స్వర్ణకుమారి, చల్లామణి పాల్గొన్నారు.చింతలపూడి : అంగన్వాడీలు కంచాలు మోగిస్తూ స్థానిక ఫైర్‌ స్టేషన్‌ సెంటర్‌లో నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు టి.మాణిక్యం, జి.అంజమ్మ, ఆర్‌విఎస్‌.నారాయణ పాల్గొన్నారు.మండవల్లి : మండలంలోని అంగన్వాడీలు చెవిలో పూలుపెట్టుకుని తమ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించేవరకూ సమ్మెను విరమించేది లేదని స్పష్టం చేశారు. కైకలూరు నియోజకవర్గ జనసేన ఇన్‌ఛార్జి బివి.రావు ధర్నా శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీలు వాణి, చెల్లమ్మ, విజయలక్ష్మి, ఉమాదేవి, కార్యకర్తలు, హెల్పర్లు పాల్గొన్నారు. జీలుగుమిల్లి : స్థానిక తహశీల్దార్‌ కార్యాలయం ఎదుట కంచాలను మోగిస్తూ అంగన్వాడీలు నిరసన తెలిపారు. వీరికి సిపిఎం, సిఐటియు నేతలు సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు కొండలరావు, అప్పారావు, అంగన్వాడీలు నాగమణి, ఎస్తేరు, సరళ పాల్గొన్నారు.చాట్రాయి : అంగన్వాడీలు నిరవధిక సమ్మె 15వ రోజు తమ ఆకలి కేకలు తీర్చాలంటూ ఖాళీ కంచాలను గరిటెలతో వాయిస్తూ నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రమీలరాణి, విజయ, స్వరూప, రాణి, రాధ, సిఐటియు మండల నాయకురాలు మేడేపల్లి హౌలీ మేరీ పాల్గొన్నారు.నూజివీడు : అంగన్వాడీలు కంచాలు మోగిస్తూ తమ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సిఐటియు పట్టణ అధ్యక్షులు ఎన్‌ఆర్‌.హనుమానులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సిఐటియు పట్టణ ప్రధాన కార్యదర్శి జి.రాజు, అంగన్వాడీల యూనియన్‌ నాయకులు ఆదిలక్ష్మి, మణి, పద్మ, జ్యోతి, వసుంధర, జాన్సీ, గ్లోరీ, వెంకటేశ్వరమ్మ, శ్యామల, శాంతి కుమారి పాల్గొన్నారు.ముసునూరు : స్థానిక సచివాలయం వద్ద అంగన్వాడీలు కంచాలు మోగిస్తూ నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో నూజివీడు ప్రాజెక్టు కార్యదర్శి పల్లిపాము రాజకుమారి, పద్మజ, విద్యావతి, మేరీ సులోచన, రోజా, శిరీష, విజయలక్ష్మి, లక్ష్మి, దుర్గ, వెంకటేశ్వరమ్మ పాల్గొన్నారు.కలిదిండి : స్థానిక మండల పరిషత్‌ కార్యాలయం ఎదుట అంగన్వాడీలు కంచాలను మోగిస్తూ నిరసన తెలిపారు. ఈ కార్యక్రమానికి మాజీమంత్రి కామినేని శ్రీనివాస్‌, ఒబిసి నాయకులు లావేటి వీరశివాజీ మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీల యూనియన్‌ నాయకులు షేక్‌ అబిదాబేగం, జక్కంశెట్టి మేనకలక్ష్మి, కొప్పినీడి రమాదేవి పాల్గొన్నారు. బుట్టాయగూడెం : అంగన్వాడీలు కంచాలను మోగిస్తూ వినూత్నంగా నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో పుష్ప, రామలక్ష్మి, మరమ్మ, భూదేవి, రామాయమ్మ, మున్ని, పార్వతి, నిర్మల పాల్గొన్నారు.ఉంగుటూరు : అంగన్వాడీలు 15వ రోజు సమ్మెలో కంచాలతో శబ్ధం చేస్తూ వినూత్నంగా నిరసన తెలిపారు. ఈ కార్యక్రమానికి సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు నారపల్లి రమణరావు, మండల కార్యదర్శి సీరా అప్పారావు, టిడిపి ఎస్‌సి సెల్‌ జిల్లా అధ్యక్షులు యాళ్ల సుజీవరావు మద్దతు తెలిపారు.టి.నరసాపురం : స్థానిక తహశీల్దార్‌ కార్యాలయం వద్ద కంచాలు మోగించి అంగన్వాడీలు వినూత్నంగా నిరసన తెలిపారు. 15 రోజులుగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడం అన్యాయమని వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జంగారెడ్డిగూడెం : అంగన్వాడీలు వినూత్నంగా కోతికి వినతిపత్రం అందజేసి నిరసన తెలిపారు. అనంతరం స్థానిక ఆర్‌డిఒ కార్యాలయం వద్ద కంచాలు మోగించి నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు ఎస్‌కె.సుభాషిణి, అంగన్వాడీలు పాల్గొన్నారు.ముదినేపల్లి : మండలంలోని అంగన్వాడీలు కంచాలు మోగిస్తూ నిరసన వ్యక్తం చేశారు. అనంతరం తహశీల్దారుకు వినతిని అందించారు.నిడమర్రు : ప్రభుత్వం దిగివచ్చే వరకూ పోరాటం కొనసాగిస్తామని మండలంలోని అంగన్వాడీలు స్పష్టం చేశారు. సమ్మె 15వ రోజు సందర్భంగా కంచాలను మోగిస్తూ నిరసన తెలిపారు. అనంతరం తహశీల్దార్‌ కార్యాలయం వద్ద ధర్నా చేసి దున్నపోతుకు వినతిపత్రం అందించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు నారపల్లి రమణారావు, అంగన్వాడీ యూనియన్‌ నాయకులు ఆర్‌.రామలక్ష్మి. ఎస్‌.ధనలక్ష్మి, కెవి.సత్యవతి, నిమ్మల పార్వతి, కోన జయమ్మ, ఈశ్వరి, వెంకటలక్ష్మి పాల్గొన్నారు.కైకలూరు : ఎంపిడిఒ కార్యాలయం ఎదుట కంచాలను గరిటెలతో మోగిస్తూ అంగన్వాడీలు నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ సిబ్బందితోపాటు తల్లులు, పిల్లలు పాల్గొని నిరసన తెలిపారు.

➡️