అంగన్‌వాడీల ముట్టడి

రామచంద్రపురంలో మంత్రి వేణుకు వినతిపత్రం అందజేస్తున్న అంగన్‌వాడీలు

ప్రజాశక్తి-యంత్రాంగం

ప్రభుత్వంతో చర్చలు విఫలం కావడంతో మరింత ఉదతంగా అంగన్‌వాడీల సమ్మె ఉధృతమైంది. రాష్ట్ర నాయకత్వం పిలుపుమేరకు బుధవారం ప్రజాప్రతినిధుల ఇల్లు ముట్టడి కార్యక్రమంలో అంగన్‌వాడీలు మంత్రి ఇళ్లు ముట్టడించారు. ఈ సందర్భంగా డిమాండ్లు పరిష్కరించాలని నిరసన తెలిపారు. అమలాపురం డిమాండ్ల పరిష్కారం కోసం అమలాపురంలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి విశ్వరూప్‌ ఇంటిని అంగన్వాడీలు ముట్టడించారు. ఈ సందర్భంగా అమలాపురం డివిజన్‌ అంగన్‌వాడీ నాయకులు బేబీ గంగారత్నం మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తమ సమస్యలను పూర్తిస్థాయిలో పరిష్కరించే వరకు సమ్మె విరమించేది లేదన్నారు. ప్రభుత్వంతో అంగన్వాడీ నాయకులు జరిపిన చర్చలు విఫలం కావడంతో తమ పోరాటాన్ని మరింత ముందుకు తీసుకెళ్తామన్నారు. అంగన్‌వాడీ హెల్పర్లు, వర్కర్లు విశ్వరూప్‌ ఇంటికి చేరుకుని ఇంటి ఎదుట నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా అంగన్‌వాడీలు ఉద్యమ గీతాలు ఆలపించారు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తమ సమస్యలు పరిష్కరించాలని కోరారు. ఒకానొక సందర్భంలో అంగన్వాడీలు మంత్రి విశ్వరూప్‌ ఇంటిలోకి చొరబడే ప్రయత్నం చేయగా పోలీసులు అడ్డుకున్నారు. విశ్వరూప్‌ ఇంటి వద్ద అమలాపురం డిఎస్‌పి అంబికా ప్రసాద్‌, అమలాపురం పట్టణ, రూరల్‌ సీఐలు క్రాంతి కుమార్‌, వీరబాబు, రూరల్‌ ఎస్‌ఐ పరదేశితో పాటు పోలీసులు మోహరించడంతో ఒకింత ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సిపిఎం జిల్లా కన్వీనర్‌ కా రెం వెంకటేశ్వరావు మాట్లాడుతూ పోరాటాలు తమకు కొత్త కాదని రాష్ట్ర ప్రభుత్వం సమస్యను సున్నితంగా పరిష్కరించాలని, జఠిలం చేయడం సరికాదన్నార. జగన్‌ ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. మంత్రి విశ్వరూప్‌ నివాసంలో అందుబాటులో లేకపోవడంతో అంగన్‌వాడీ నాయకులు వినతి పత్రాన్ని మంత్రి పిఎకు అందజేశారు. కార్యక్రమంలో జిల్లా ట్రెజరర్‌ పి.అమూల్య, ప్రాజెక్టు నాయకులు ఎం.విజయ రత్నకుమారి, దైవకప, ధనలక్ష్మి పరిపూర్ణ, మణిమాల, సుబ్బలక్ష్మి, సీత సమంతకమణి రుక్మిణి తదితరులు పాల్గొన్నారు. రామచంద్రపురం తమ న్యాయమైన కోరికలను పరిష్కరించాలంటూ అంగన్వాడీ వర్కర్లు బుధవారం రాష్ట్ర బిసి సంక్షేమ శాఖ మంత్రి వేణుగోపాలకష్ణ ఇల్లు ముట్టడించారు. ముందుగా మున్సిపల్‌ కార్యాలయం వద్ద నుండి మంత్రి ఇంటి వరకు నిరసన ప్రదర్శన నిర్వహిస్తూ మంత్రి వేణి ఇంటినిచుట్టుముట్టారు. తమ డిమాండ్లు పరిష్కరించాలని నినాదాలు చేశారు. అదేవిధంగా కాళీ ప్లేట్లు గరిటెలతో మంత్రి ఇంటి వద్ద నిరసన తెలిపారు. అంగన్‌వాడీ కార్యకర్తలు నిరసన విన్న మంత్రి ఇంటి నుంచి బయటకు వచ్చి అంగన్‌వాడీలను ఉద్దేశించి ప్రసంగించారు.సమస్యలను సిఎం దృష్టికి తీసుకు వెళ్తా. మంత్రి వేణుఅంగన్‌వాడీ వర్కర్లు చేస్తున్న సమ్మె వారి డిమాండ్లను పరిష్కారం కోసం సిఎం జగన్‌ను కలిసి వివరిస్తానని మంత్రి వేణుగోపాలకష్ణ హామీ ఇచ్చారు. తన ఇంటి వద్ద బయట ఉన్న అంగన్‌వాడీ వర్కర్లతో మంత్రి వేణు మాట్లాడుతూ మంత్రి బొత్స సత్యనారాయణ ఎప్పటిక చర్చలు జరిపారని ప్రభుత్వం పేదలకు ఎప్పుడూ అండగా ఉంటుందన్నారు. మహిళలకు డ్వాక్రా అమ్మఒడి, ఆసరా పథకాలు అందిస్తుంది అనే వివరించిన మంత్రి ప్రసంగానికి అంగన్‌వాడీ వర్కర్లు అడ్డు తగిలారు. తమకు ఏ విధమైన పథకాలు ఉండటం లేదని వారు మంత్రి దష్టికి తీసుకువెళ్లారు దీనితో మంత్రి రేపే సిఎం జగన్‌ దష్టికి అంగన్వాడి సమస్యలు తీసుకువెళ్తామన్నారు. వీలైనంత మేర సమస్యల పరిష్కారానికికషి చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం అంగన్‌వాడీ వర్కర్లు మంత్రికి వినతి పత్రం అందజేశారు.కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి నూకల బలరాం, అంగన్‌వాడీ వర్కర్ల యూనియన్‌ నాయకులు ఎం.దుర్గావరలక్ష్మి తదితరులు ఆధ్వర్యంలో సుమారు నాలుగు వందల మంది నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు.మండపేట కనీసవేతనం రూ.26 వేలు ఇవ్వాలని గ్రాట్యూటి అమలు తదితర సమస్యల పరిష్కారం కోరుతూ స్థానిక మున్సిపల్‌ కార్యాలయం వద్ద అంగన్‌వాడీలు చేపట్టిన సమ్మె బుధవారానికి16వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీ యూనియన్‌ ఇచ్చిన పిలుపుమేరకు అంగన్‌వాడీలు మండపేట పట్టణంలోని ఎంఎల్‌ఎ వేగుళ్ల జోగేశ్వరరావు, ఎంఎల్‌సి, తోట త్రిమూర్తులు కార్యాలయాలను ముట్టడించారు. అనంతరం ఎంఎల్‌ఎ వేగుళ్లకు వినతిపత్రం అందించారు. పలువురు అంగన్‌వాడీలు మాట్లాడుతూ 6 రోజులుగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దుర్మార్గమన్నారు. ప్రభుత్వం దిగి వచ్చే వరకు సమ్మె కొనసాగుతుందని స్పష్టం చేశారు. రేపటి నుంచి సమ్మెను మరింత ఉధతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండపేట ప్రాజెక్ట్‌ అంగన్వాడీ కార్యకర్తలంతా పాల్గొన్నారు.

 

➡️