అంగన్‌వాడీల వంటావార్పు

ప్రజాశక్తి – ఏలూరు అర్బన్‌

అంగన్‌వాడీల నిరవధిక సమ్మెలో భాగంగా బుధవారం ఏలూరు కలెక్టరేట్‌ వద్ద వంటా వార్పు నిర్వహించి వినూత్నంగా నిరసన తెలిపారు. కలెక్టరేట్‌ ఆవరణలో వంట చేసుకుని అక్కడే భోజనాలు చేశారు. ఈ సందర్భంగా సిఐటియు రాష్ట్ర కార్యదర్శి డిఎన్‌విడి.ప్రసాద్‌, ఎఐటియుసి రాష్ట్ర అధ్యక్షులు ఆర్‌.రవీంద్రనాథ్‌ మాట్లాడుతూ అంగన్‌వాడీల న్యాయమైన సమస్యలు పరిష్కరించకపోతే సిఎం జగన్‌కు ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. వారి సమస్యలు పరిష్కరించలేని ప్రభుత్వం సెంటర్ల తాళాలు, తలుపులు బద్దలు కొడుతూ చట్టాన్ని ఉల్లంఘిస్తోందని విమర్శించారు. అంగన్‌వాడీల సమస్యలు పరిష్కరించాలని ఏడాది కాలంగా పోరాడుతున్నా జగన్‌ ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోందన్నారు. సమ్మెకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. సిఐటియు నగర కార్యదర్శి వి.సాయిబాబు మాట్లాడుతూ అంగన్‌వాడీ వర్కర్స్‌ యూనియన్‌ నాయకులు రజనీ, హైమావతి, స్వప్న, నవతి, కనకదుర్గ, సోములమ్మ, నిర్మల, జయసుధ, ఈశ్వరమ్మ, కె.భార్గవి, అంథోని పాల్గొన్నారు. యుటిఎఫ్‌ రాష్ట్ర నాయకులు సుభాషిణి, పివి.నరసింహారావు, ఐలు నాయకులు సంఘీభావం తెలిపారు.ఏలూరులో పలు సెంటర్ల తాళాలు బద్దలుఏలూరు నగరంలో అనేక వార్డుల్లో అంగన్‌వాడీ కేంద్రాల తాళాలను సచివాలయ ఉద్యోగులు బుధవారం పగలగొట్టారు. అయితే ఎక్కడికక్కడ అంగన్‌వాడీలు అడ్డుకున్నారు. అద్దె ఇళ్లలో నడుస్తున్న సెంటర్ల యజమానులు అభ్యంతరం తెలిపారు. సుందరయ్య కాలనీలో సెంటర్‌ తాళాలు బద్దలు కొట్టడానికి వచ్చిన సిబ్బందిని లబ్ధిదారులు ఆ కాలనీ ప్రజలు అడ్డుకొని వెనక్కి పంపించారు. జీలుగుమిల్లి : అంగన్‌వాడీలు సమెలో భాగంగా తొమ్మిదో రోజు వినూత్నంగా నిరసన తెలిపారు. పచ్చగడ్డి తింటూ తమ నిరసన తెలిపారు. ఈ సమ్మెకు సిఐటియు, వెలుగు ఉద్యోగుల సంఘం మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అధికారులు తమ సమస్యలు పరిష్కరించకుండా అంగన్‌వాడీలను బెదిరించడం ప్రభుత్వానికి తగదని విమర్శించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకులు విజయలక్ష్మి, శ్యామల, మాణిక్యం, కార్యదర్శి కొండలరావు, అంగన్‌వాడీలు నాగమణి, ఎస్తేరు, జ్యోత్స్న, పూర్ణ పాల్గొన్నారు. పెదపాడు:అంగన్‌వాడీల సమ్మెను విచ్ఛిన్నం చేయాలనే ప్రయత్నాలను విరమించుకుని సమస్యలు పరిష్కరించాలని ఎపి రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాస్‌, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు బి.సోమయ్య ప్రభుత్వాన్ని కోరారు. పెదపాడులోని బస్టాండ్‌ సెంటర్‌లో అంగన్‌వాడీలు చేపట్టిన సమ్మె తొమ్మిదో రోజుకు చేరింది. ఈ సందర్భంగా వంటావార్పు చేసి నిరసన తెలిపారు. ఈ సమ్మెకు రైతు సంఘం నాయకులు మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు గుండపనేని సురేష్‌, షేక్‌ కరీముల్లా, సిఐటియు మండల కార్యదర్శి రెడ్డి లక్ష్మణరావు, అంగన్‌వాడీ వర్కర్స్‌, హెల్పర్స్‌ యూనియన్‌ పెదపాడు ప్రాజెక్టు అధ్యక్షురాలు ఎస్‌.తిరుపతమ్మ, కె.శారద, ఎ.దేవమణి, సీతామహాలక్ష్మి, దుర్గ, జ్యోతి పాల్గొన్నారు. నూజివీడు టౌన్‌:స్థానిక ఆర్‌డిఒ కార్యాలయం వద్ద అంగన్‌వాడీలు చేపట్టిన సమ్మె తొమ్మిదో రోజుకు చేరింది. ఈ సందర్భంగా వంటావార్పు చేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి జి.ఆనందరాజు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి అంగన్‌వాడీల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు ఎన్‌ఆర్‌.హను మాన్లు, అంగన్‌వాడీ వర్కర్స్‌ యూనియన్‌ నాయకులు ఆదిలక్ష్మి, వసుంధర, పద్మజ్యోతి, విజయలక్ష్మి, ఎఐటియుసి నాయకులు పుల్లారావు, దుర్గ పాల్గొన్నారు.కొయ్యలగూడెం : మండలంలో అంగన్‌వాడీల సమ్మె తొమ్మిదో రోజుకు చేరింది. ఈ సందర్భంగా అంగన్‌వాడీలు వంటావార్పు చేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు రాంబాబు మాట్లాడుతూ అంగన్‌వాడీలు రోజుకోరకంగా నిరసన నిరసన తెలుపుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. అంగన్‌వాడీలకు అండగా ఉంటామని తెలిపారు. ఈ సందర్భంగా అంగన్‌వాడీల యూనియన్‌ గౌరవ అధ్యక్షురాలు కె.విజయలక్ష్మి మాట్లాడుతూ పిల్లల సమగ్ర అభివృద్ధికి, మతాశిశు మరణాలను తగ్గించడానికి ఎంతగానో కృషి చేస్తున్న అంగన్‌వాడీలను ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్‌వాడీల యూనియన్‌ నాయకులు పి.సుజాత, ప్రధాన కార్యదర్శి పి.భారతి, అంగన్‌వాడీ ప్రాజెక్ట్‌ అధ్యక్షులు శివరత్నకుమారి, పి.పద్మజ, జె.నాగవేని, అడపా నాగజ్యోతి, సిహెచ్‌.సునీతారాయల్‌, బొబ్బిలి చిట్టి, కె.జ్యోతి, కె.మాధవి, పి.భాగ్యలక్ష్మి, ఎం.వెంకటలక్ష్మి, ఎం.మంగ, శ్రీదేవి, నుర్జహాన్‌ పాల్గొన్నారు.చాట్రాయి : సమస్యలు పరిష్కరించాలని కోరుతూ అంగన్‌వాడీల నిరవధిక సమ్మె తొమ్మిదో రోజుకు చేరింది. ఈ సందర్భంగా సమ్మె శిబిరం వద్ద వంటావార్పు చేసి నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో అంగన్‌వాడీల యూనియన్‌ నాయకులు పల్లె రాజకుమారి పాల్గొన్నారు. టి.నరసాపురం : అంగన్‌వాడీలు సమ్మెలో భాగంగా స్థానిక తహశీల్దార్‌ కార్యాలయం వద్ద వంటావార్పు నిర్వహించి నిరసన తెలిపారు. సమస్యలు పరిష్కరించేవరకూ సమ్మె కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో అంగన్‌వాడీ కార్యకర్తలు, హెల్పర్లు పాల్గొన్నారు.భీమడోలు : అంగన్‌వాడీలు తొమ్మిదో రోజు సమ్మెలో భాగంగా వంటావార్పు చేసి నిరసన తెలిపారు. ఈ సమ్మె శిబిరాన్ని సిఐటియు జిల్లా అధ్యక్షులు ఆర్‌.లింగరాజు సందర్శించారు. ఈ కార్యక్రమంలో అంగన్‌వాడీల యూనియన్‌ నాయకులు స్వర్ణకుమారి, చెల్లామణి పాల్గొన్నారు.చింతలపూడి : అంగన్‌వాడీల తొమ్మిదో రోజు సమ్మెలో భాగంగా వంటావార్పు నిర్వహించారు. ఈ సమ్మెకు కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షులు విస్సంపల్లి సుందర్‌రావు అంగన్‌వాడీలకు పసుపు, కుంకుమ ఇచ్చి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంగన్‌వాడీల న్యాయమైన డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం నెరవేర్చాలని డిమాండ్‌ చేశారు. తెలంగాణ ప్రభుత్వం కంటే వెయ్యి రూపాయలు ఎక్కువ ఇస్తానని చెప్పిన సిఎం నేడు మాట తప్పారని విమర్శించారు. తెలంగాణ ప్రభుత్వంలో అంగన్‌వాడీలకు రూ.18 వేలు ఇస్తున్నారని, కానీ ఇక్కడ మాత్రం ఇవ్వడం లేదన్నారు. ఈ కార్యక్రమంలో ఎఐటియుసి అధ్యక్షులు గంధం అంజమ్మ, సిఐటియు నాయకులు సరోజనీ, అంగన్‌వాడీలు అరుణ, కవిత, సరళ, మరియమ్మ, విజయలక్ష్మి, సిఐటియు నాయకులు నత్త వెంకటేశ్వరరావు, నారాయణ, సత్యనారాయణ, బాలరాజు, జఫ్రుల్లా, కాంగ్రెస్‌ నాయకులు పాల్గొన్నారు.బుట్టాయగూడెం : అంగన్‌వాడీల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించలేని ప్రభుత్వం వారి సమ్మెను విచ్ఛిన్నం చేయడానికి కలెక్టర్ల ద్వారా ఆదేశాలు జారీ చేసి సచివాలయ ఉద్యోగులతో కేంద్రాల తాళాలు పగలగొట్టడం అప్రజాస్వామికమని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు అందుగుల ఫ్రాన్సిస్‌, పి.మంగరాజు తెలిపారు. మండలంలోని రెడ్డిగణపవరం సచివాలయం వద్ద అంగన్‌వాడీల సమ్మెకు మద్దతుగా గ్రామంలోని తల్లులు తమ పిల్లలతో ఆందోళన చేశారు. అంగన్‌వాడీల సమస్యలు పరిష్కరించకుండా సచివాలయ ఉద్యోగులు కేంద్రాల తాళాలు తెరిస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు పి.మంగరాజు మాట్లాడారు. ముసునూరు : అంగన్‌వాడీలు ముసునూరులో నూజివీడు ఐసిడిఎస్‌ ప్రాజెక్టు కార్యదర్శి పల్లి పాము రాజకుమారి ఆధ్వర్యంలో భిక్షాటన చేసి వినూత్నంగా నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యావతి, శిరీష, దుర్గ, లక్ష్మి, మేరీ సులోచన, రాణి, విజయలక్ష్మి పాల్గొన్నారు.కలిదిండి : స్థానిక మండల పరిషత్‌ కార్యాలయం ఎదుట అంగన్‌వాడీలు చేపట్టిన సమ్మె తొమ్మిదో రోజుకు చేరింది. ఈ సందర్భంగా వారు శిబిరం వద్ద వంటావార్పు చేసి నిరసన తెలిపారు. వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి శేషపు మహంకాళిరావు, సిఐటియు మండల అధ్యక్షులు షేక్‌ అబీదాబేగం, ఉపాధ్యక్షులు చిన్నం శ్రీకాంత్‌, అంగన్‌వాడీల యూనియన్‌ నాయకులు జక్కంశెట్టి మేనక లక్ష్మి, కొప్పినీడి రమాదేవి పాల్గొన్నారు.బుట్టాయగూడెం : మండలంలోని పలు అంగన్‌వాడీ కేంద్రాల తాళాలను సచివాలయ సిబ్బంది పగులకొట్టారు. దీంతో అంగన్‌వాడీలు పోలీస్‌ స్టేషన్‌ వద్ద నిరసన తెలిపి ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి నాగమణి, సిఐటియు మండల అధ్యక్షులు పుష్ప, అంగన్‌వాడీ ప్రాజెక్టు నాయకులు కృపామణి, రామలక్ష్మి, నూర్జహాన్‌, ఆకాశమ్మ పాల్గొన్నారు.నిడమర్రు : అంగన్‌వాడీల సమ్మెకు టిడిపి నాయకులు పోసింసెట్టి రామ్మూర్తి మద్దతు తెలిపారు. తొమ్మిదో రోజు సమ్మెలో భాగంగా అంగన్‌వాడీలు వంటావార్పు చేసి నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకులు రమణరావు, ఎన్‌.పార్వతి. జయమ్మ, ఆర్‌ రామలక్ష్మి, కె.సుభాషిణి, కుమారి, నాగమణి, ధనలక్ష్మి పాల్గొన్నారు.పోలవరం : అంగన్‌వాడీల సమ్మెకు జనసేన మండల అధ్యక్షులు గునపర్తి వెంకట సత్యనారాయణ, నియోజకవర్గ ఇన్‌ఛార్జి చిర్రి బాలరాజు సంఘీభావం తెలిపారు. తొమ్మిదో రోజు సమ్మెలో తెలగంశెట్టి రాము, కురసం రమేష్‌, వనిమిరెడ్డి సీతయ్య, కొక్కెర సత్తిబాబు, ఎ.రాధయ్య, మామిడిపల్లి స్వాతి, మామిడిపల్లి ప్రసాద్‌, టి.నరసింహమూర్తి, కె.సురేష్‌, కిషోర్‌, పి.శ్రీను, పల్లపు స్వామి, నాగేంద్ర, రామకృష్ణ, రాంబాబు, రాంబాబు, పిఎల్‌ఎస్‌.కుమారి పాల్గొన్నారు.కైకలూరు : అంగన్‌వాడీలు వంటావార్పుతో నిరసన తెలిపారు. స్థానిక తాలూకా సెంటర్‌లో చేపట్టిన అంగన్‌వాడీల సమ్మె శిబిరాన్ని మాజీమంత్రి కామినేని శ్రీనివాస్‌ సందర్శించ మద్దతు తెలిపారు. సిఐటియు నాయకులు కురేళ్ల లాజరు, టిడిపి, జనసేన నాయకులు తాడినాడ బాబు, జానీ, రత్నారావు, గంగుల శ్రీదేవి, కొల్లి వరప్రసాద్‌, తోట లక్ష్మీ పాల్గొన్నారు.ముదినేపల్లి : సమ్మె తొమ్మిదో రోజుకు చేరింది. ఈ సందర్భంగా అంగన్‌వాడీలు మాట్లాడుతూ ప్రభుత్వం తక్షణం స్పందించి సమస్యలనుపరిష్కరించాలని, లేకుంటే సమ్మెను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.అంగన్వాడీ కేంద్రాల పిల్లల బాధ్యత ప్రభుత్వానిదేజంగారెడ్డిగూడెం : అంగన్‌వాడీ కేంద్రాల్లోని పిల్లలకు ఏదైనా ప్రమాదాలు జరిగితే రాష్ట్ర ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని ఐఎఫ్‌టియు జిల్లా అధ్యక్షులు కెవి.రమణ హెచ్చరించారు. డివిజన్‌ ప్రయివేటు ఎలక్ట్రికల్‌ వర్కర్స్‌ యూనియన్‌ సమావేశం గణేష్‌ అధ్యక్షతన జరిగింది. ముఖ్యఅతిథిగా రమణ మాట్లాడుతూ తొమ్మిది రోజులుగా అంగన్‌వాడీలు సమ్మె చేస్తుంటే సమస్యలు పరిష్కరించకుండా, సచివాలయ, రెవెన్యూ ఉద్యోగులతో కేంద్రాల తాళాలు పగులకొట్టించడం దుర్మార్గమన్నారు. ఈ సమావేశంలో యూనియన్‌ జనరల్‌ సెక్రటరీ బాలిన ధర్మరాజు, ఉపాధ్యక్షులు ఎరుబండి వీర్రాజు పాల్గొన్నారు

➡️