అంగన్‌వాడీల విజయోత్సవ సభ

Feb 2,2024 21:27

 ప్రజాశక్తి – సీతానగరం: మండల కేంద్రంలోని అంగన్వాడీ కార్యకర్తలు సహాయకులు ఆధ్వర్యంలో శుక్రవారం విజయోత్సవ సభను నిర్వహించారు. స్థానిక తహశీల్దార్‌ కార్యాలయం ఎదుట అంబేడ్కర్‌ విగ్రహం ఎదుట కేకును కట్‌చేసి పంచిపెట్టారు. 42రోజులంతా కలిసికట్టుగా సమ్మె విజయవంతంగా నిర్వహించామని, ప్రభుత్వం కూడా 13డిమాండ్లను పరిష్కారం చేయడం వల్ల అందరికీ మంచి జరిగిందన్నారు. కార్యక్రమంలో అంగన్‌వాడీ వర్కర్స్‌, హెల్పర్స్‌ యూనియన్‌ జిల్లా కార్యదర్శి గంట జ్యోతి, నాయకులు మడక సత్యవతి, రెడ్డి లక్ష్మి, పార్వతి, పద్మ, శైలజ, సునీత, సిఐటియు జిల్లాప్రధాన కార్యదర్శి యమ్మల మన్మధరావు, నాయకులు రెడ్డి లక్ష్మునాయుడు, రెడ్డి ఈశ్వరరావు, గవర వెంకట రమణ తదితరులు పాల్గొన్నారు.

➡️