అంగన్వాడీల సమస్యలపై సానుకూలంగా స్పందించండి

పీడీని కోరిన యూనియన్‌ నాయకులు

 పల్నాడు: జిల్లా అంగన్వాడీల సమస్యల పట్ల సానుకూలంగా స్పందించి పరిష్కరించేందుకు తన వంతు కృషి చేయాలని అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ పల్నాడు జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కెపి మెటిల్డా దేవి, గుంటూరు మల్లేశ్వరిలు ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ ఉమారాణిని కోరారు. కొన్ని నెలలుగా డిప్యూటేషన్‌ లో ఉన్న పిడి ఉమారాణి ఇటీవల బాధ్యతలు స్వీకరించారు. 42 రోజులుగా సమ్మెలో ఉన్న నేపథ్యంలో అంగన్వాడీ యూనియన్‌ నాయకులు మంగళవారం ఆమెను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. సమస్యలు పరిష్కారం కోసం సంకల్ప దీక్షతో పోరాటం చేసిన అంగన్వాడీల పోరాటంతో ప్రభుత్వం దిగివచ్చిన నేపథ్యంలో అంగన్వాడీ ల అంకితభావంతో పని చేయాలని లబ్ధిదారులకు మెరుగైన సేవలు అందించాలని ఆమె సూచించారు. కార్యక్రమంలో శ్రామిక మహిళ సమన్వయ కమిటీ జిల్లా కన్వీనర్‌ డి.శివ కుమారి, ప్రాజెక్ట్‌ లీడర్లు శోభారాణి, బి నిర్మల ,బివి రమణ, డి.మాధవి తదితరులు పాల్గొన్నారు.

➡️