అంగన్‌వాడీల సమ్మెతో దద్దరిల్లిన కలెక్టరేట్

అంగన్‌వాడీల సమ్మెతో దద్దరిల్లిన కలెక్టరేట్

ప్రజాశక్తి-రాజమహేంద్రవరంఅంగన్‌వాడీ వర్కర్లు హెల్పర్లు తమ సమస్యలు పరిష్కరించాలని చేపట్టిన నిరవధిక సమ్మె రెండో రోజుకు చేరింది. జిల్లావ్యాప్తంగా 3000 మంది అంగన్వాడీ వర్కర్లు హెల్పర్లు బొమ్మూరులోని కలెక్టరేట్‌ వద్దకు చేరుకున్నారు. ప్రభుత్వం సమస్యలు పరిష్కరిస్తే తప్ప సమ్మె విరమించేది లేదని పెద్ద ఎత్తున నినదించారు. రాజమహేంద్రవరం రూరల్‌ ఎంఎల్‌ఎ బుచ్చయ్య చౌదరి, జనసేన రాజానగరం నియోజకవర్గ కో ఆర్డినేటర్‌ బత్తుల బలరామకృష్ణ సంఘీభవం తెలిపి మాట్లాడారు. జగన్‌ ప్రభుత్వం ఎన్నికల ముందు తెలంగాణ కంటే అదనంగా రూ.వెయ్యి ఇస్తానన్న హామీని ఎందుకు అమలు చేయలేదో చెప్పాలని ప్రశ్నించారు. సిఎం వైఎస్‌.జగన్‌ రాష్ట్రంలో ఉద్యోగులకు, కార్మికులకు తీవ్ర అన్యాయం చేశారన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు చేయాలన్నారు. రాబోయే టిడిపి, జనసేన ప్రభుత్వంలో అంగన్‌వాడీలకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. సిపిఎం జిల్లా కార్యదర్శి టి.అరుణ్‌ మాట్లాడుతూ జగన్‌ ప్రభుత్వం మరో మూడు నెలల్లో ఎన్నికలకు పోతున్న నేపథ్యంలో అంగన్‌వాడీల సమస్యల పరిష్కారంలో మీన మీషాలు లెక్కిస్తోందని విమర్శించారు. గత ఎన్నికల్లో జగన్‌ను ముఖ్యమంత్రిని చేసింది అంగన్‌వాడీ స్కీం వర్కర్లు అన్న సంగతి మరువద్దని హితవు పలికారు. ఉద్యోగులు, కార్మికులు, ఉపాధ్యాయులు, మధ్యతరగతి ప్రజలు అందరిపైన తీవ్ర భారాలు మోపి, కనీసం వారికిచ్చే వేతనాలు పెంచే విషయంలో కనీస కనికరం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం మేకపోతు గాంభీర్యం నటిస్తోందన్నారు. ఎపి ఆశ వర్కర్స్‌ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షులు కె.పోచమ్మ, జిల్లా ట్రెజరర్‌ ఎం.వెంకటలక్ష్మి, కెవిపిఎస్‌ జిల్లా కార్యదర్శి జువ్వల రాంబాబు, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి ఎం రాజా, ఐద్వా జిల్లా అధ్యక్షులు ఎ.జరీనా షరీఫ్‌, సిఐటియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎం.సుందర్‌ బాబు, బి.రాజులోవ, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు ఎస్‌ఎస్‌.మూర్తి, కర్రి రామకష్ణ, ఎపి అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మాణిక్యంబ, కె.బేబిరాణి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎపి ఆశ వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్షులు కె.అన్నామణి, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షులు భాస్కర్‌, ఎపి అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ ప్రాజెక్ట్‌ అధ్యక్ష కార్యదర్శులు మాలతి, సుబ్బలక్ష్మి, బి.మార్త, దుర్గంబ, మార్త సుజాత, శారద, సునీత, పుష్ప, రామాలక్ష్మి, టిబి.లక్ష్మి పాల్గొన్నారు.పెరవలి ఎపి అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ పిలుపు మేరకు మండలంలోని అన్ని క్లస్టర్ల పరిధిలో అంగన్‌వాడీ వర్కర్లు హెల్పర్లు బుధవారం రాజమహేంద్రవరం పెద్ద ఎత్తున తరలి వెళ్లి ధర్నాలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు దుర్గ, దుర్గా లక్ష్మి, రామలక్ష్మి, శ్రీదుర్గ, కన్యాకుమారి, విజయ, పుణ్యవతి, జ్యోతి, నాగలక్ష్మి, రాణి, కృష్ణవేణి, విశాలి, సత్తార్‌బీ పాల్గొన్నారు.

➡️