అంగన్‌వాడీల సమ్మె ఉధృతం

Dec 13,2023 22:41
పలు కార్మిక, ప్రజా

అంగన్‌వాడీలు నిరవధిక సమ్మెను ఉధృతం చేశారు. వందలాది అంగన్‌వాడీలు రోడ్లపైకి వచ్చారు. ప్రభుత్వం పట్ల నిరసనను వ్యక్తం చేశారు. ప్రభుత్వం దిగొచ్చేవరకూ సమ్మెను విరమించేది లేదని స్పష్టం చేశారు. వారి సమ్మెకు రోజురోజుకూ మద్దతు పెరుగుతోంది. పలు కార్మిక, ప్రజా సంఘాలతో పాటూ టిడిపి, జనసేన నాయకులు సైతం సమ్మె శిబిరాలకు వచ్చి సంఘీభావం తెలుపుతున్నారు.

ప్రజాశక్తి – కాకినాడ ప్రతినిధి, యంత్రాంగం

అంగన్‌వాడీలు చేపట్టిన సమ్మె బుధవారం నాటికి రెండో రోజుకు చేరింది. జిల్లావ్యాప్తంగా అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాలు ఆయా మండల కేంద్రాల్లో తహశీల్దార్‌, ఎంపిడిఒ, ఐసిడిఎస్‌ కార్యాలయాల వద్ద ధర్నా చేపట్టారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని నినదించారు. అంగన్‌వాడీలు చేపట్టిన సమ్మెకు సిపిఎం, టిడిపి, జనసేన పార్టీలతోపాటు, ప్రజా సంఘాలు మద్దతునిచ్చాయి. సమస్యలు పరిష్కరించాలని, హామీలు అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ అంగన్‌వాడీలు చేపట్టిన నిరవధిక సమ్మె బుధవారం రెండోరోజూ కొనసాగింది. కాకినాడ ఇంద్రపాలెం లాకులు వద్ద, కాకినాడ అర్బన్‌లో సమ్మె శిబిరాన్ని సిఐటియు జిల్లా కోశాధికారి మలకా వెంకటరమణ ప్రారంభించారు. సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి సిహెచ్‌.రాజ్‌కుమార్‌ మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా మొండి వైఖరిని వీడి న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలన్నారు. ఈ ధర్నా శిబిరాన్ని జనసేన పార్టీ కాకినాడ రూరల్‌ నాయకులు పంతం నానాజీ, మాజీ మేయర్‌ సుంకర పావని, టిడిపి నాయకులు, తుమ్మల రమేష్‌, గదుల సాయిబాబా, నేషనల్‌ వికలాంగుల సంఘం నాయకులు సిహెచ్‌ సుబ్బారావు, వికలాంగుల హక్కుల పోరాట సమితి అధ్యక్షులు ఎం.పాపిరెడ్డి, జనసేన కాకినాడ జిల్లా అధ్యక్షులు తోట సుధీర్‌, టిడిపి కాకినాడ మహిళా విభాగం అధికార ప్రతినిధి మీసాల సునీత, పి.లక్ష్మీప్రసన్న మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ కాకినాడ ప్రాజెక్టు నాయకురాలు ఎమ్‌కె.జ్యోతి, జిల్లా కోశాధికారి రమణమ్మ, రమ, నీరజ, మున్ని, సరోజ, జోగమ్మ తదితరులు పాల్గొన్నారు. పిఠాపురం అంగన్వాడీల సమస్యలు పరిష్కరించే వరకు సమ్మె విరమించమని సిఐటియు జిల్లా అధ్యక్షులు డి.శేషాబాబ్జి అన్నారు. స్థానిక తహశీల్దార్‌ కార్యాలయం వద్ద జరుగుతున్న అంగన్‌దవాడీ నిరసన శిబిరాన్ని ఆయన సందర్శించి మద్దతు పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం చర్చలకు పిలిచి సమ్మెను ఆపకపోతే ఉద్యోగం నుంచి తొలగిస్తామని హెచ్చరించడం దారుణమన్నారు. ఇటువంటి బెదిరింపులకు అంగన్‌వాడీలు భయపడేది లేదన్నారు. అంగన్‌వాడీల సమ్మెకు సిపిఎం నాయకుడు కోనేటి రాజు, మాజీ ఎంఎల్‌ఎ వర్మ సతీమణి లక్ష్మి దేవి, కౌన్సిలర్‌ అన్నపూర్ణ, ఆర్‌.భాస్కరరావు, బిజెపి నాయకులు, ఐలు జిల్లా నాయకులు జిఎస్‌.భాస్కర్‌ మద్దతు పలికారు. ఈ కార్యక్రమంలో విజయశాంత, కమలారాణి, ప్రజా శాంత, బేబీ, సూర్యకాంతం, నళిని పాల్గొన్నారు.రౌతులపూడి అంగన్‌వాడీల నిరవధిక సమ్మె బుధవారానికి రెండో రోజు చేరుకుంది. స్థానిక తహశీల్దార్‌ కార్యాలయం వద్ద నిర్వహించిన ధర్నాలో యూనియన్‌ సెక్టార్‌ నాయకురాలు రాజేశ్వరి మాట్లాడుతూ తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసమే నిరవధిక సమ్మెను ప్రారంభించామని తెలిపారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. తమ హక్కులను సాధించుకునేంత వరకూ సమ్మెను విరమించేది లేదని అన్నారు. కాజులూరు స్థానిక పంచాయతీ కార్యాలయం వద్ద అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాలు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సెక్టార్‌ నాయకులు వరలక్ష్మి, హనుమావతి, అన్నవరం మాట్లాడారు. డిమాండ్ల పరిష్కరించేంత వరకూ సమ్మెను విరమించేది లేదని స్పష్టం చేశారు. అంగన్‌వాడీల సమ్మెకు సిపిఎం మండల కన్వీనర్‌ వల్లు రాజబాబు, జనసేన నాయకులు చిక్కాల దొరబాబు, డేగల వెంకట సతీష్‌ సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో అంగన్‌వాడీలు మామిడి ప్రసన్న, జొన్నలగడ్డ సరోజినీ, సలాది లక్ష్మి, నందికోళ్ల నాగమణి, శేషారత్నం, వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. పెద్దాపురం స్థానిక మున్సిపల్‌ సెంటర్‌లో అంగన్‌వాడీల ఆందోళన కొనసాగింది. ఈ సందర్భంగా అంగన్‌వాడీల పోరాటానికి సిపిఎం, జనసేన పార్టీలు మద్దతు ప్రకటించాయి. జనసేన నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌ తుమ్మల రామస్వామి మాట్లాడారు. సిఐటియు మండల అధ్యక్షులు గడిగట్ల సత్తిబాబు, ప్రయివేట్‌ ఎలక్ట్రికల్‌ వర్కర్స్‌ యూనియన్‌ గౌరవాధ్యక్షులు చింతల సత్యనారాయణ, సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు కరణం ప్రసాదరావు, సిరపరపు శ్రీనివాస్‌ శిబిరానికి చేరుకుని మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో యూనియన్‌ నాయకులు దాడి బేబీ, తలారి నాగమణి, అమల, ఫాతిమా, ఎస్తేరు రాణి, వరలక్ష్మి, జె కుమారి, తదితరులు పాల్గొన్నారు. యు. కొత్తపల్లి స్థానిక తహశీల్దార్‌ కార్యాలయం వద్ద అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాలు ధర్నా నిర్వహించారు. తహశీల్దార్‌కు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా జిల్లా రైతు సంఘం కార్యదర్శి అప్పారెడ్డి ధర్నా శిబిరంలో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో బిల్డింగ్‌ వర్కర్స్‌ నాయకులు సాంబశివరావు, మి డే మీల్స్‌ వర్కస్‌ నాయకులు కె. నాగేశ్వరరావు, డి.అన్నపూర్ణ, ఒ.సత్యవతి, జి ఆనంద్‌, బేబీరాణి పాల్గొన్నారు. కరప తహశీల్దార్‌ కార్యాలయం వద్ద అంగన్‌వాడీలు ధర్నా నిర్వహించారు. సిఐటియు మండల కార్యదర్శి రాంప్రసాద్‌ ప్రారంభించి మాట్లాడారు. కాకినాడ రూరల్‌ అధ్యక్షురాలు, కరప సెక్టర్‌ నాయకురాలు పి.వీరవేణి, ఎస్‌.వరలక్ష్మి మాట్లాడారు. అంగన్‌వాడీల ధర్నాకు జనసేన పార్టీ నాయకులు భోగి రెడ్డి కొండలరావు, భోగిరెడ్డి గంగాధరరావు, వీర వెంకట సత్యనారాయణ, పేకేటి ప్రసాద్‌, పేపకాయల శ్రీనివాస్‌, సిపిఎం నాయకులు ఎం.రమణి, విఒఎ సంఘం నాయకులు పద్మ, శ్రీదేవి సత్య, జిల్లా యుటిఎఫ్‌ ఆడిట్‌ కమిటీ అధ్యక్షుడు పి.రాజబాబు, యుటిఎఫ్‌ మండల అధ్యక్ష, కార్యదర్శులు కెవి.నాగేశ్వరరావు, కురుపూడి వెంకటరమణ, స్థానిక యూటిఎఫ్‌ నాయకులు వై.శ్రీనివాసరావు, తేజ, పి.రాజబాబు, సత్యనారాయణ, 108 యూనియన్‌ నాయకులు త్రిమూర్తులు, భవన నిర్మాణ కార్మికుల నాయకులు కె.సురేష్‌ తదితరులు సమ్మెకు మద్దతు ప్రకటించారు. తాళ్లరేవు స్థానిక తహశీల్దార్‌ కార్యాలయం వద్ద జరుగుతున్న అంగన్‌వాడీల ధర్నా కార్యక్రమంలో సిపిఎం మండల కన్వీనర్‌ టేకుమూడి ఈశ్వరరావు, ఆశ వర్కర్ల అధ్యక్షులు పి. అనంతలక్ష్మి, ఐద్వా రాష్ట్ర నాయకులు సిహెచ్‌.రమణి, వ్యవసాయ కార్మిక సంఘం మండల నాయకులు దుప్పి అదృష్టదీపుడు, ఎం.తణుకురాజు, విశ్రాంత ఉద్యోగుల సంఘం నాయకులు అత్తిలి బాబురావు, యుటిఎఫ్‌ నాయకులు పాల్గొని మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్ట్‌ యూనియన్‌ నాయకులు బి.పద్మజ, ఎన్‌.కృష్ణవేణి, జి.పార్వతి, తదితరులు పాల్గొన్నారు. గండేపల్లి స్థానిక తహశీల్దార్‌ కార్యాలయం వద్ద అంగన్‌వాడీల ధర్నా కొనసాగింది. ఈ ధర్నా కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షురాలు ఇ. చంద్రావతి పాల్గొని మాట్లాడారు. అనంతరం తహశీల్దార్‌ కెవిపి.సత్యనారాయణకు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో మండల అంగన్‌వాడీ యూనియన్‌ అధ్యక్షురాలు రాజేశ్వరి, నాయకులు వీరలక్ష్మి, జగదీశ్వరి, దేవి, వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. జగ్గంపేట రూరల్‌ స్థానిక తహశీల్దార్‌ కార్యాలయం వద్ద జరుగుతున్న అంగన్‌వాడీల ధర్నాకు టిడిపి అంగన్‌వాడీ యూనియన్‌ రాష్ర ఉపాధ్యక్షురాలు పోలినాటి ధర్మానంద కుమారి పాల్గొని సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల టిడిపి మహిళ అధ్యక్షురాలు నకిరెడ్డి సూర్యవతి, ఉపాధ్యక్షురాలు గుమ్మళ్ళ అనంతలక్ష్మి, జగ్గంపేట టిడిపి టౌన్‌ అధ్యక్షురాలు గెద్దాడ సత్యవేణి, తిప్పన సత్యవతి, అంగన్‌వాడీ యూనియన్‌ మండల ప్రధాన కార్యదర్శి బండి సుజాత, సెక్టార్‌ లీడర్‌ అల్లం గంగాభవాని, బి.రామలీల, ఎస్‌.చంటమ్మ, వైవి.కృపాభారు, తదితరులు పాల్గొన్నారు. ఏలేశ్వరం మండల కేంద్రమైన ఏలేశ్వరంలో అంగన్‌వాడీలు చేపట్టిన నిరవధిక సమ్మెలో భాగంగా ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు యుటిఎఫ్‌ జిల్లా ఉపాధ్యక్షుడు వివి.రమణ, యుటిఎఫ్‌ కుటుంబ సంక్షేమ జిల్లా నాయకులు ఆర్‌.రామలింగేశ్వర రావు, జిల్లా కౌన్సిల్‌ సభ్యులు ప్రసాద్‌, పతిపాడు మండల సిఐటియు కార్యదర్శి రొంగల ఈశ్వరరావు మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో అంగన్‌వాడీలు అల్లాడి లక్ష్మి, కాకరపల్లి సునీత, హేమలత, టి.నాగ వరలక్ష్మి, మరియ, నూకరత్నం గంగాభవాని, కె.అచ్చిరాజు పాల్గొన్నారు.

➡️