అంగన్‌వాడీల 24 గంటల దీక్ష

అంగన్‌వాడీల 24 గంటల దీక్ష

అంగన్‌వాడీలు తమ డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ తలపెట్టిన సమ్మె శనివారం 26వ రోజుకు చేరింది. నిర్బంధాలను లెక్క చేయబోమని వారు స్పష్టం చేశారు. ప్రజాశక్తి-యంత్రాంగం కాకినాడ కలెక్టరేట్‌ వద్ద 24 గంటల రిలే నిరాహార దీక్షలను సిఐటియు జిల్లా అధ్యక్షుడు దువ్వా శేషబాబ్జి, అంబేద్కర్‌ ఉద్యమ సీనియర్‌ నాయకుడు అయితాబత్తుల రామేశ్వరరావు ప్రారంభించారు. కలెక్టరేట్‌ వద్ద దీక్షలకు అనుమతులు లేవని పోలీసులు అడ్డుకోవడంతో ఎండలోనే ఫుట్‌పాత్‌పై బైఠాయించారు. దీంతో పోలీసులు దిగిరాక తప్పలేదు. అంగన్‌వాడీలకు న్యాయ సహకారం అందిస్తామని ఆల్‌ ఇండియా లాయర్స్‌ యూనియన్‌ జిల్లా కార్యదర్శి భాస్కర్‌, రాష్ట్ర కార్యదర్శి జ్యోతి తెలిపారు. అంగన్‌వాడీ వర్కర్స్‌, హెల్పర్స్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్ష కార్యదర్సులు దడాల పద్మ, ఎరుబండి చంద్రవతి మాట్లాడారు. నాయకులు ధనలక్ష్మి, రాజేశ్వరి, వీరమణి, వరలక్ష్మి, మంగతాయారు, భాంధవి, కె.సీత, ఎం.గంగాభవాని, సిహెచ్‌.రాధ, నారాయణమ్మ, ఎం.సుజాత, జి.ప్రేమావతి, నూకరత్నం, పి.వరలక్ష్మి, డి.వీరవేణి పాల్గొన్నారు. సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల రాజ్‌ కుమార్‌, కోశాధికారి మలకా రమణ, జిల్లా నాయకులు మేడిశెట్టి వెంకట రమణ, రాయుడు మోజెస్‌, ఐద్వా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు రమణి, జిజిహెచ్‌ మెస్‌ యూనియన్‌ నాయకులు కృష్ణ మద్దతు తెలిపారు. కిర్లంపూడి నల్ల బెలూన్లతో అంగన్‌వాడీలు నిరసన తెలిపారు. సమస్యలను పరిష్కరించేంతవరకు సమ్మె విరమించేది లేదని స్పష్టం చేశారు. రత్నం, కె.అచ్యుతాంబ, ఎలిజిబిత్‌ రాణి, పి.సావిత్రి, షేక్‌ పర్వీన్‌, జి.రత్నం, పి.మంగాయమ్మ, పి.ప్రభావతి, హసీనా బేగం పాల్గొన్నారు. ఏలేశ్వరం తహశీల్దారు కార్యాలయం వద్ద ఒంటి కాలిపై నిల్చుని నిరసన తెలిపారు. వీరికి సిఐటియు నాయకులు రొంగల ఈశ్వరరావు, సిపిఐ (ఎంఎల్‌) లిబరేషన్‌ మానుకొండ లచ్చబాబు, జనార్ధన్‌ మద్దతు తెలిపారు. కె.సత్య, అచ్చిరాజు, యు.మరియ, గనిలక్ష్మి పాల్గొన్నారు.పిఠాపురం అంగన్‌వాడీల సమ్మె శిబిరం వద్దకు 108 ఉద్యోగుల సంఘం నాయకులు రాజు వచ్చి తమ మద్దతు తెలిపారు. అమల, వెంకటలక్ష్మి, ప్రజావాణి, నళిని, సత్యవతి, భవాని, అమల, బేబీరాణి, రామలక్ష్మి, నాగ పద్మ పాల్గొన్నారు.కోటనందూరు అంగన్‌వాడీల సమ్మెకు మాజీ కేంద్ర మంత్రి ఎంఎం.పల్లంరాజు కాంగ్రెస్‌ నాయకులు మద్దతు తెలిపారు. కార్మికులు సమస్యలు పరిష్కరించలేని ముఖ్యమంత్రి జగన్‌కు పాలించే అర్హత లేదని వారు విమర్శించారు. కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు పాండురంగారావు, దాట్ల కార్యరాజు మాట్లాడారు. అంగన్‌వాడీ నాయకులు ధనలక్ష్మి, మేరీ సమాధానం, పద్మ శాంతి, లీల, సిఐటియు మండల నాయకులు నక్కెళ్ల శ్రీనివాస్‌ పాల్గొన్నారు.పెద్దాపురం నల్ల గొడుగులు, బెలూన్లతో నిరసన తెలిపారు. యూనియన్‌ నాయకులు బేబీ, వరలక్ష్మి, దుర్గ, భవాని, పద్మ పాల్గొన్నారు.

➡️